టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 17న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి అంతేకాకుండా దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అయితే ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు.
విడుదల సమయం రానే వచ్చేసింది.
అయితే ఈ సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండగా మూవీ మేకర్స్ కు చిక్కులు వచ్చి పడ్డాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.పుష్ప హిందీ వెర్షన్ కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదట.
మేకర్స్ కంప్లీట్ ప్రింట్‌ను సెన్సార్ బోర్డుకు పంపకపోవడంతో అసంపూర్తిగా ఉన్న సినిమాను చూసేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నో చెప్పినట్టు బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఆ తర్వాత మేకర్స్ తుది కాపీని సెన్సార్ బోర్డుకు పంపించగా దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుందని తెలుస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం సుకుమార్ అండ్ టెక్నికల్ టీమ్ కలిసి సోమవారం వరకు అవసరమైన సవరణలు చేసే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.అయితే తెలుగుతోపాటు దక్షిణాది భాషల వెర్షన్ లకు ఫైనల్ సౌండ్ మిక్సింగ్ లేకుండానే క్లియరెన్స్ ఇచ్చేశాయి సెన్సార్ బోర్డులు.కానీ పుష్ప హిందీ వెర్షన్ కు సంబంధించి మొదటి నుంచి చిక్కులు చుట్టుముడుతున్నాయి.అంతేకాదు ముంబై, ఢిల్లీతోపాటు ఇతర పట్టణాల్లో కూడా పరిమిత థియేటర్లలోనే పుష్ప విడుదల కానున్నట్టు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.