పిచ్చి పీక్స్.. పెళ్లిలో ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా..!

యువతులు సాధారణ సమయాల్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా పర్లేదు కానీ పెళ్లి సమయంలో మాత్రం చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.

అలాగని రూలేం లేదు కానీ జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అత్యంత మధురమైన, శుభప్రదమైన ఈ ఘట్టంలో పద్ధతిగా ముస్తాబు కావడం ముఖ్యం.

అందులోనూ మన భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తూ పట్టుచీర లేదా లెహంగా కట్టుకుంటే అందరి కనులకు ఇంపుగా ఉంటుంది.కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కొత్తదనం అంటూ పిచ్చి ప్రయత్నాలు చేస్తూ అభాసుపాలు అవుతున్నారు.

తాజాగా ఒక పెళ్లికూతురు ట్రెడిషనల్ డ్రెస్ కు బదులు ఏకంగా జీన్స్ ప్యాంటు ధరించింది.ఆ ప్యాంటుకు రెండు పక్కలా పెద్ద బొక్కలు కూడా ఉన్నాయి.

ఇదేం టెస్టో ఏమోగానీ ఆమె పైన మాత్రం సంప్రదాయంగా టాప్ ధరించి కింద మాత్రం జీన్స్ తో చిత్ర విచిత్రంగా కనిపించింది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఈ వీడియోలో కనిపించిన వధువు పేరు ముద్రా భగత్.ఆమె తన పెళ్లికి రెడీ అవుతూ ఇలా జీన్స్ ప్యాంటులో దర్శనమిచ్చింది.కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇదేంటి డెనిమ్ జీన్స్‌లో ఉన్నావు.

లెహంగా వేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.అందుకు ఆమె బదులిస్తూ తాను జీన్స్ ప్యాంటులోనే పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చింది.

ఇందులో కూడా నువ్వు అందంగానే ఉన్నావ్ అంటూ వారు చిరునవ్వు నవ్వారు.ఈ వధువు వరుడి చేతులు పట్టుకొని అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి శాశ్వతంగా అతడితోనే ఉంటానని వాగ్దానం చేయాల్సి ఉంది.

అయితే ఈ వేదిక్ వెడ్డింగ్ కు ఆమె జీన్స్ ప్యాంటు ధరించి నడుస్తానని చెబుతోంది.ఈ దృశ్యాలను బంధువులు వీడియో తీశారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

దాన్ని విట్టి వెడ్డింగ్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ షేర్ చేసింది.

Advertisement

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కాగా దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.జీన్స్ ప్యాంటు వేసుకోవాలని అనుకున్నప్పుడు లెహంగా ఎందుకు కొనుక్కున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.ఏ దేశంలో కూడా ఇలా పెళ్లికి చిరిగిన జీన్స్ వేసుకోరు తల్లి.

అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు మాత్రం భారతీయ పెళ్లి సంప్రదాయాలను ఖరాబ్ చేయకు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.50 వేల లైకులు, వందల్లో కామెంట్లు వస్తున్నాయి.

తాజా వార్తలు