ప్రభుత్వాన్ని పరిపాలించే అర్హత సీఎం జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

గుంటూరు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.ఓటిఎస్ పేరుతో పేద ప్రజల నుంచి నిర్బంధ వసూలు చేస్తూ ఒత్తిడి చేయలేదని ప్రకటన చేయడం దుర్మార్గం.

ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి నుంచి దుర్మార్గంగా నగదు వసూలు చేస్తోంది.లబ్ధిదారులు నగదు చెల్లించకుండా తిరగబడాలి.

ప్రజా ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది.లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం అనాలోచిత చర్య.

దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతోంది.తడిసిన ధాన్యం, పత్తి తదితర పంటలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

Advertisement

ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది.ప్రజలకు రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతలు వినియోగించకుండా ఎమ్మెల్యేలు మంత్రులకు కాపలా కాయడం తో పాటు మద్యం అమ్మకాలకు వినియోగిస్తుంది.చివరకు ఐఏఎస్ లు కూడా మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి నెలకొంది.ప్రభుత్వాన్ని పరిపాలించే అర్హత సీఎం జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు