మీరు ఎప్పుడన్నా కంప చెట్టు గురించి విన్నారా.? అదే అండి మన పల్లెటూర్లలో ఎక్కడ చుసిన ఈ కంప చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి.ఈ కంప చెట్లను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.కంప చెట్టు అని, తుమ్మ చెట్టు అని, సర్కార్ చెట్టు అని, ముళ్ల చెట్టు అని ఎవరికీ నచ్చిన పేర్లలో వారు పిలుస్తూ ఉంటారు.
ఈ చెట్టు నుంచి వచ్చే కాయలను పశువులకు మేతగా ఉపయోగిస్తారు.ఈ చెట్టు ఆకులను మేకలు మేస్తూ ఉంటాయి.అలాగే ఈ చెట్టు యొక్క కలపను వంట చేరుకుగా కూడా ఉపయోగిస్తారు.ఈ చెట్లు ఎక్కువగా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి.
అయితే ఈ చెట్లను అక్కడి ప్రజలు కలుపు మొక్కగా అభివర్ణిస్తారు.ఎందుకంటే ఈ చెట్టు గుజరాత్ ప్రాంత ప్రజల జీవనోపాధికి అడ్డంకిగా మారింది కాబట్టి.
ఇలా కలుపు మొక్కగా భావించే ఈ చెట్టు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతో హానికరమైన గాండో బవల్ లేదా ప్రోసోపిస్ జులిఫ్లోరా (prosopis juliflora- PJ) అనే మొక్క కచ్ ప్రాంతంలోని సాంప్రదాయ బన్నీ గడ్డి భూములను నాశనం చేసింది.
అందుకే అక్కడ స్థానిక ప్రజలు దీనిని ‘గ్రహాంతర కలుపు’ మొక్కగా పిలుస్తారు.పొలాలను నాశనం చేస్తున్న కారణంగా ఈ చెట్టుని నరికేస్తు ఉంటారు.తాజాగా ఈ చెట్టుపై నిర్వహించిన పరిశోధనలు మాత్రం స్థానికులకు గుడ్ న్యూస్ అందించాయని చెప్పాయి.కాగా బన్ని గడ్డి భూములను కాపాడేందుకు ఈ PJ కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించాలని కొన్నాళ్లుగా అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కానీ గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెసర్ట్ ఎకాలజీ ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధన పత్రం మాత్రం ఈ మొక్క గురించిన ఉపయోగాలను ప్రజల ముందుంచింది.PJ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించడం వలన లక్షలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించవచ్చని తెలిపింది.ఈ PJ మొక్కలను బ్రెడ్, బిస్కట్, సిరప్, కాఫీ, కాక్‌టెయిల్, బ్రాందీ వంటి వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో దీన్ని ఉపయోగించవచ్చు అని పరిశోధకులు తెలిపారు.

అలాగే ఈ చెట్టు కలపను బొగ్గు తయారు చేయడానికి వాడడం వలన విద్యుదుత్పత్తికి కూడా ఉపయోగించవచ్చని పరిశోధన పత్రం పేర్కొంది.నెమ్మదిగా మండే ఈ కలప ద్వారా పెద్దగా పొగ కూడా రాదు.ఫలితంగా పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగదు.
వివిధ దేశాల్లో PJ చెట్టును వినియోగిస్తున్నారని ఇంకా మన భారతదేశంలో PJ చెట్టు గురించి సరైన అవగాహనా లేదని, అందుకే వీటిపై ప్రజలలో అవగాహన కల్పించాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.అంతేకాకుండా గ్రహాంతర జాతిగా పరిగణిస్తున్న ఈ మొక్క ద్వారా ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.