టీఆర్ ఎస్‌లో ప‌ద‌వుల లొల్లి.. సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు

అధికార టీఆర్ ఎస్‌లో చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ప‌ద‌వుల పందేరం మొద‌ల‌వ‌బోతోంది.

ఇప్ప‌టి దాకా ప‌ద‌వుల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్న వారంద‌రికీ త్వ‌ర‌లోనే పద‌వుల పండుగ రాబోతోంది.

అయితే ఇక్క‌డే కేసీఆర్ త‌న మార్కును చూపెట్టేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పుడు పార్టీ గ్రాఫ్ ప‌డిపోతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ అన్ని జిల్లాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు నేత‌లు చేజారి పోకుండా చూసుకునేందుకు రెడీ అవుతున్నారు.

దీంతో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యం టీఆర్ ఎస్‌లో వ‌ర్గ పోరుకు దారి తీస్తోంది.జూనియ‌ర్ల వ‌ర్సెస్ సీనియ‌ర్లు అన్న‌ట్టు త‌యార‌వుతోంది.

ఇప్ప‌టికే హుజూరాబాద్ ఫ‌లితం చూపించిన ఎఫెక్ట్ ప్ర‌జ‌ల్లో ఉన్నందున దాని నుంచి ప్ర‌జ‌ల మైండ్ ను అర్జెంటుగా డైవ‌ర్ట్ చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు.ఇందులో భాగంగా వీలైనంత త్వ‌ర‌గా ప‌ద‌వుల భ‌ర్తీకి రెడీ అయిపోయారు.

Advertisement

దీంతో సీనియ‌ర్లుగా ఉన్న మధుసూదనాచారి, అలాగే గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, కోటిరెడ్డి లాంటి వారు ఈ రేసులో ఉన్నారు.మొత్తం ఆరు ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు రెడీ అవుతున్న నేప‌థ్యంలో పాడి కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి యువకులు కూడా పోటీ ప‌డుతున్నారు.

ఇక వీరితో పాటు గ‌తంలో డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన క‌డియం శ్రీహ‌రి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రినివాస్‌రెడ్డి లంటి వారు కూడా ఆశ‌ప‌డుతున్నారు.అయితే గ‌తంలో వేరే పార్టీల నుంచి వ‌చ్చిన వారు కూడా చాలామందే ఆశ‌లు పెట్టుకున్నారు.ఎల్‌.

ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు లాంటివారు కూడా ఉన్నారు.ఇలా పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న సీనియ‌ర్లు ఒక‌వైపు, కొత్త‌గా కేసీఆర్ హామీల‌తో వ‌చ్చిన వారు ఒక‌వైపు, పార్టీకోసం ప‌నిచేస్తున్న యువ‌నేత‌లు మ‌రోవైపు పోటీ ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా పార్టీలో కీల‌కంగా ఉన్న‌వారు బ‌య‌టి నుంచి వ‌చ్చిన వారు అన్న‌ట్టు వార్ న‌డుస్తోంది.చూడాలి మ‌రి అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు