చాటింగ్‌యాప్‌కు బానిసైన బాలుడు.. చివ‌ర‌కు ఏం చేశాడంటే..

ఇవాల రేపు ట్రెండ్ ఎంత‌లా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.యూత్ టెక్నాల‌జీని స‌న్మార్గంలో వాడ‌కుండా కొన్నిసార్లు చెడు ప్ర‌యోగాల‌కు కూడా వాడేస్తున్నారు.

అదే వారి కొంప ముంచుతోంది.ఇక ఇప్పుడు టీనేజ‌ర్లు కూడా విప‌రీతంగా స్మార్ట్ ఫోన్లు వాడేస్తుండ‌టంతో అది వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.

ఇవాళ రేపు ఎవ‌రి చేతుల్లో చూసినా స‌రే స్మార్ట్ ఫోన్ కంప‌ల్స‌రీగా క‌నిపిస్తుంది.దీనితో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే అన‌ర్థాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు ఓ బాలుడు కూడా ఇలాంటి ఇబ్బందుల్లోనే ప‌డ్డాడు.ఈ మ‌ధ్య చాటింగ్ యాప్ లు ఎంత‌గా ఫేమ‌స్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

Advertisement

ఇక ఈ బాలుడు కూడా ఈ చాటింగ్ యాప్‌కు బానిసై పోయి నిముషం కూడా ఆ చాటింగ్ యాప్ నుంచి బ‌య‌ట‌కు రాలేనంత అడిక్ట్ అయిపోయాడు.గంటలు గంటలు చాటింగ్ చేస్తూనే ఉండి స‌డెన్ గా ఇంట్లో వారికి పెద్ద షాక్ ఇచ్చాడు.

ఇంటి పారిపోయాడు.ఈ ఘ‌ట‌న దేశంలో పెద్ద రాష్ట్ర‌మైన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

థానే జిల్లాలోని బద్లాపూర్ ప్రాంతంలో నివ‌సించే 13 ఏళ్ల బాలుడు ఇలా ఇంటి నుంచి పారిపోయాడు.కాగా అత‌ను గోవాకు చేరుకున్నాడ‌ని తెలిసింది.

అయితే బాలుడి అదృశ్యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారి విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ల‌కు వ‌చ్చాయి.ఒక ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిపోయి ఇలా పారిపోయాడ‌ని తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

డిస్కార్డ్ మొబైల్ యాప్ కార‌ణంగా అత‌ను పూర్తిగా మెసేల్ చేయ‌డానికి అడిక్ట్ అయిపోయాడ‌ని తెలిసింది.ఇక అత‌ను చాటింగ్ చేసే గ్రూప్ లో ఉన్న వారంతా కూడా జీవితంలో ఏదో ఒక‌టి చేసి త‌మ‌ను తాము నిరూపించుకోవాల‌నే ఛాలెంజ్ ను పెట్టుకోవ‌డంతో ఇలా బాలుడు కూడా ఏదో ఒక‌టి సాధించేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడంట‌.

Advertisement

తాజా వార్తలు