వావ్ : ఆ కంపెనీ తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్ గా ఇచ్చిందట...

ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఈ మధ్యకాలంలో కొందరు ఈ పెట్రోల్ డీజిల్ ధరల బారి నుంచి తప్పించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

దీనికితోడు ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్యం తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ కూడా ఇస్తోంది.దీంతో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే తాజాగా ఓ సంస్థ తమ కంపెనీలో పని చేసేటువంటి ఉద్యోగులకి ఎలక్ట్రిక్ వాహనాలను దీపావళి పండుగ బోనస్ గా ఇచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణ పరిసర ప్రాంతంలో అలియెన్స్ సంస్థ తన సేవలను అందిస్తోంది.

దీంతో ఈ సంస్థలో పని చేసేందుకు ఉద్యోగులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వస్తుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్ మరియు డీజిల్ ధరల చెర నుంచి తమ ఉద్యోగులకి విముక్తి కలిగించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఇందులో భాగంగా తమ సంస్థలో పని చేస్తున్న 35 మంది ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను దీపావళి పండుగ బోనస్ గా బహూకరించింది.దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇంధన ధరల తో విసిగి పోయామని దాంతో తమ కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్న కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.అయితే అలియన్స్ కంపెనీ బహూకరించిన స్కూటర్ల ధర దాదాపుగా 70 వేల రూపాయలకు పైగా ఉంది.

అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనం వినియోగం తగ్గించేందుకు పలు ప్రముఖ నగరాలలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఉపయోగిస్తున్నారు.దీంతో చాలా డబ్బు ఆదా అవ్వడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.అలాగే పలు వాహనాల ఉత్పత్తిదారు సంస్థలు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

ఇందులో ఇప్పటికే టాటా, మహీంద్రా, సుజుకి వంటి సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి బాగానే విజయం సాధించాయి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు