టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ను సంక్రాంతికి ముందు వారంలో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను మొదట ఎన్నో తేదీల్లో విడుదల చేసేందుకు పరిశీలించారు.
కాని ఏ ఒక్క తేదీ కూడా సెట్ అవ్వక పోవడంతో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.అంతకు ముందే సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ మరియు పవన్ మరియు రానా ల భీమ్లా నాయక్ సినిమాలు విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చి విడుదల తేదీలను కూడా ఖరారు చేయడం జరిగింది.
అయితే ఆ మూడు సినిమా లు ఉండగా ఆర్ ఆర్ ఆర్ రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా ల పరిస్థితి ఏంటా అంటూ అంతా కూడా ఆలోచనల్లో పడ్డారు.

ఆర్ ఆర్ ఆర్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటి కాకుంటే రెండు అయినా సంక్రాంతి బరి నుండి తప్పుకోవడం ఖాయం అంటున్నారు.ముఖ్యంగా మహేష్ బాబు మరియు రాధే శ్యామ్ ల సినిమా గురించిన వార్తలు జోరుగా వస్తున్నాయి.ఈ రెండు కాని రెంటిలో ఒకటి కాని తప్పుకునే అవకాశం ఉందంటున్నారు.
ఈ సమయంలో రాజమౌళి ఒక మీడియా ఇంట్రాక్షన్ లో మాట్లాడుతన్న సమయంలో ఒక జర్నలిస్ట్ ఆర్ ఆర్ ఆర్ వస్తున్న సంక్రాంతికే భారీ పాన్ ఇండియా మూవీ అయిన ప్రభాస్ రాధే శ్యామ్ రాబోతుంది కదా ఏమంటారు అంటూ ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.ఈ సమయంలో వచ్చే ప్రతి ఒక్క సినిమాను మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.
ఈ సమయంలో మా సినిమానే బాగా ఆడాలి.మా సినిమా సినిమాకే ఎక్కువ వసూళ్లు రావాలనే ఆలోచన ఆశ లేదు.
ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అన్ని సినిమాలు బాగా ఆడాలి మంచి వసూళ్లు దక్కించుకోవాలనే కోరుకుంటాం.అది పోటీ అని కాని మరోటి అని కాని అనుకోవడం లేదు అంటూ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ రాధే శ్యామ్ కు పాన్ ఇండియా అప్పీల్ ఉంది.కనుక ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
రెండు సినిమాల వసూళ్ల విషయంలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.కనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.