కెనడా : చరిత్ర సృష్టించిన భారతీయులు.. రెండు నగరాలకు మేయర్లుగా ఎన్నిక

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.

సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.

కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.

ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన మాజీ ఫెడరల్ మినిస్టర్ అమర్‌జీత్ సోహీ (57) ఎడ్మొంటన్ మేయర్‌గా, జ్యోతి గొండెక్ కాల్గరీకి తొలి మహిళా మేయర్‌గా చరిత్ర సృష్టించారు.పంజాబ్ నుంచి బ్రిటన్‌కు వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు జ్యోతి యూకేలో జన్మించారు.

Advertisement

ఆమె తండ్రి జస్దేవ్ సింగ్ గ్రెవాల్ భారత్‌, ఇంగ్లాండ్‌లలో న్యాయవాదిగా శిక్షణ పొందారు.అనంతరం జ్యోతికి నాలుగేళ్ల వయసున్నప్పుడు వీరి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది.

ఇక పంజాబ్‌కే చెందిన అమర్‌జీత్ సోహీ గతంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంత్రి వర్గాల్లో సహజ వనరుల శాఖ, మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.తాజాగా ఎడ్మొంటన్ మేయర్‌గా ఎన్నికైన అనంతరం సోహి మాట్లాడుతూ.ఎడ్మొంటన్ మేయర్‌గా ఎన్నికైన తొలి దక్షిణాసియా వాసిగా తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాల్లోకి ప్రవేశించకముందు అమర్‌జిత్ సోహి.ఎడ్మొంటన్ ట్రాన్సిట్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేశారు.

ఆయన తొలుత 2007లో ఎడ్మొంటన్ సిటీ కౌన్సిల్‌కి ఎన్నికయ్యాడు.అనంతరం 2015లో ఫెడరల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.దీనిలో భాగంగా ఎడ్మొంటన్ మిల్‌ వుడ్స్ నుంచి లిబరల్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి ట్రూడో కేబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాగా.పంజాబ్‌లో వేర్పాటు వాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న 1988 మధ్యకాలంలో థియేటర్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్న అమర్‌జిత్ సోహిని బీహార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

అంతేకాదు ఆయనపై తీవ్రవాది అన్న ముద్ర వేయడం ఆశ్చర్యకరం.అయినప్పటికీ స్వయంకృషితో కెనడాలోని భారతీయ సమాజంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు అమర్‌జీత్.

తాజా వార్తలు