ఎస్బిఐ అకౌంట్ హోల్డర్స్ కు అలర్ట్..!

సంపాదించిన డబ్బును ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకునేందుకు ప్రజలు బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకున్నారు.

బ్యాంకులో డబ్బులు పెడితే లాకర్ లో పెట్టి తాళం వేసిన అంత హాయిగా ఉంటారు.

మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వేసుకోవడం, కావాల్సినప్పుడు తీసుకోవడం లాంటి లావాదేవీలు బ్యాంకింగ్ రంగంలో జరుపుతూ ఉంటాము.అయితే కొందరు సైబర్ నేరగాళ్లు దీని అదునుగా చూసుకొని మోసాలకు పాల్పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రతిరోజు ఏదో ఒక ఆన్లైన్ మోసం జరుగుతుండడం, రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనే దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఒక విషయాన్ని తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించింది.

అయితే చాలామంది ఎస్బిఐ అకౌంట్ ఉన్న వినియోగదారులు యోనో బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయిందని మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో బ్యాంక్ అవి పంపడం లేదని, కనుక వినియోగదారులు ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపింది.లేకపోతే బ్యాంక్ అకౌంట్ కాళీ అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Advertisement

ఎస్బీఐ వినియోగదారులకు తమ యోనో బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని మెసేజ్ లు వస్తున్నాయి.మెసేజ్ లలో లింక్ పై క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయి, పాస్వర్డ్ వివరాలు అప్డేట్ చేయాలని అందులో ఉంటుంది.అయితే ఆ లింక్ పై క్లిక్ చేసి వివరాలు అందిస్తే నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది.

ఒకవేళ అలాంటి మెసేజ్లు వస్తే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండాలని తెలిపింది.ఈ అంశంపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది.ఇలాంటి మెసేజ్లు స్టేట్ బ్యాంక్ పంపించడం లేదని, అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు