వైసీపీలో చేరేందుకు పవన్ ప్రయత్నం కానీ...? ఏపీ డిఫ్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు 

ఏపీ లో హాట్ టాపిక్ రాజకీయం వ్యవహారం ఏదైనా నడుస్తుందా అంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శలే.

రెండు పార్టీల మధ్య వరుసగా కౌంటర్లు , ప్రతి  కౌంటర్ల తో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది.

గతంతో పోలిస్తే జనసేన రాజకీయంగా బాగా బలం పెంచుకోవడం,  తరుచుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండడంతో,  టిడిపి  కంటే జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.  అలాగే వైసీపీ కూడా టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా,  జనసేన చేస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ రాజకీయ వ్యూహాన్ని నడిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.       అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ విమర్శించే అంత స్థాయి లేదని, ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణస్వామి ఆ తరువాత మీడియాతో పవన్ వ్యవహారంపై మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక పవన్ మాట్లాడుతున్నారని నారాయణస్వామి మండిపడ్డారు.ఏదో రోజు పవన్ పై ప్రజలు తిరగబడే సమయం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

అసలు పవన్ కళ్యాణ్ వైసీపీలో చేరేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారని, కానీ పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశం జగన్ ఇవ్వలేదని నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.   

  ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగానూ,  రాజకీయంగానూ విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి పై దాడికి దిగారు.తనకు ఏమైనా అయితే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని, తన కుటుంబాన్ని సోషల్ మీడియా లో వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు పోసాని కృష్ణ మురళి ఇప్పటికే స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఈ రోజు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లా జనసేన నాయకులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఏపీ లో అనేక సమస్యలపై పోరాటం తో పాటు, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు