బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో నుంచి తొలి వారం సరయు ఎలిమినేట్ కాగా రెండో వారం ఉమాదేవి మూడవ వారం లహరి షారి ఎలిమినేట్ అయ్యారు.వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అయితే నాలుగవ వారం మాత్రం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో నటించి లహరి షారి పాపులారిటీని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో లహరి ఇతరులు తన గురించి ఏమనుకున్నా అస్సలు పట్టించుకునేవారు కాదు.తనపై ఎవరైనా డైరెక్ట్ గా నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం లహరి షారి ధీటుగా జవాబు ఇచ్చేవారు.ఆవేశం ఎక్కువైన ఈ బ్యూటీ హౌస్ లో కాజల్ తో ఎక్కువగా గొడవ పడేవారు.బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా లహరి షారి ఎంట్రీ ఇవ్వగా మూడో వారమే ఈమె ఎలిమినేట్ కావడం గమనార్హం.
లహరి షారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి.మొదటి వారం గొడవలతో హైలెట్ కావడం, హౌస్ లో ముక్కుసూటిగా వ్యవహరించడం, ప్రతి విషయానికి గొడవ పడటం ఆమెకు మైనస్ అయింది.
బిగ్ బాస్ హౌస్ లో ప్రియ, ప్రియాంక, సిరి టార్గెట్ చేయడంతో పాటు లహరి సన్నిహితంగా ఉండే మానస్ తో ఆమె గురించి నెగిటివ్ గా చెప్పారు.ముగ్గురు కంటెస్టెంట్లు టార్గెట్ చేయడం లహరికి మైనస్ గా మారింది.