జ‌గ‌న్ చేసిన ప‌నే ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోందా..?

రాజ‌కీయాల్లో ఏది చేసినా స‌రే చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.లేదంటే మాత్రం ఇబ్బందుల్లో ప‌డాల్సి ఉంటుంద‌ని ఇప్పుడున్న టీడీపీని చూస్తూనే అర్థం అవుతోంది.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న ప‌నులు చివ‌ర‌కు ఆయ‌న్ను ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయ‌ని తెలుస్తోంది.అదేంటంటే ఏపీలో జ‌రిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జ‌గ‌న్ ఇన్వాల్వ్ అయ్యారు.

ఆయ‌నే ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక స్పష్టమైన పిలుపు అంద‌జేశారు.పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు అన‌వ‌స‌రం అని కాబ‌ట్టి ఏకగీవాలు జ‌రిగితే ఊర్ల‌కు నిధుల ప్రోత్సాహకాలు వ‌స్తాయ‌ని చెప్పారు.

నిజానికి ఈ ఎన్నిక‌ల‌కు పార్టీలో ఎలాంటి సంబంధం లేద‌నేది అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం అయినా కూడా వైసీపీ నేత‌ల‌ను గెలిపించుకునేందుకు జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేశార‌నేది కూడా వాస్త‌వం.ఇంకేముంది ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి అన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.

Advertisement

వీరిలో చాలా వ‌ర‌కు వైసీపీ పార్టీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.అయితే ఏ గ్రామంలో అయితే 2 వేలలోపు జనాభా ఉంటారో వఆ ఊరికి రూ.5 లక్షలు వ‌ర‌కు అలాగే ఏ గ్రామంలో అయితే 2 వేల నుంచి 5 వేల దాకా ప్ర‌జ‌లు ఉంటారా ఆ ఊరికి 10 లక్షలు ఇక 5 దాదాపుగా 10 వేల దాకా జనాభా ఉంటే 15 లక్షలు ఇలా ఇస్తామంటూ అప్ప‌ట్లోనే జ‌గ‌న్ ప్ర‌క‌టిచేంశారు.

దీంతో చాలా గ్రామాల ప్ర‌జ‌లు దీనిపై పెద్ద‌గా వివాదాస్ప‌దం చేయ‌కుండా చాలా వ‌ర‌కు వైసీపీకి చెందిన వారినే ఏక‌గ్రీవం చేసేందుకు ప్ర‌య‌త్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలలోపు జనాభా పంచాయతీలు ఎక్కువ‌గా ఏకగ్రీవం కావ‌డం గ‌మ‌నార్హం.రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలు ఏక‌గ్రీవం అయ్యాయి.

కానీ వీటికి ఆ స్థాయిలో ఇప్టికీ ప్రోత్సాహకాలు అందలేదు.దీంతో స‌ర్పంచుల‌తో పాటు అటు వార్డు మెంబర్లు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.

వీరు త్వ‌ర‌లోనే కొత్త క‌మిటీలుగా ఏర్ప‌డి ప్రబుత్వానికి అర్జీలు పెట్టేందుకు రెడీ అవుతున్నారంట‌.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు