మానవుల మెదడుకు అద్భుతమైన శక్తి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మన శరీరంలో లక్షల పనులను మెదడు మిల్లిసెకన్లలోనే పూర్తి చేస్తుంటుంది.
ఇక ఆలోచనా విధానంలోనూ మానవ మెదడుకు ఏ మెదడు సాటి రాదు.దాన్ని ట్రైన్ చేయాలే గానీ ఎలాంటి గొప్ప ఆవిష్కరణలైనా సృష్టించగలదు.
ఇక సృజనాత్మక ఆలోచనలు చేయడంలోనూ సమస్త విశ్వంలో మానవులే ముందుంటారు.క్రియేటివ్ థింకింగ్ లో మనుషులను జయించడం ఎవరికీ సాధ్యపడదు.
అయితే పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం భవిష్యత్తులో రోబోలు.మనుషులకు అన్ని విధాలా ధీటుగా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే మానవుడు తన తెలివిని, ఆలోచనా విధానాన్ని రోబోలకు అందిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు.ఇటీవల కాలంలో రోబోలు దానంతటవే ఆలోచించి ఏదైనా ఒక భాషలో కవిత్వాలు, ప్రసంగాలు రాసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటున్నాయి.
సాధారణంగా మానవుడు ఇచ్చే ఇన్ పుట్ పరిధిలోనే రోబోలు పరిమిత శక్తిని కలిగి ఉంటాయి.దానంతట అది ఆలోచించే ఊహాత్మక శక్తి కలిగి ఉండదు.
తన చుట్టూ జరుగుతున్న పరిసరాలకు అనుగుణంగా జాలి, దయ చూపించే శక్తి కూడా రోబోలకు ఉండదు.కానీ ఆ శక్తిని కూడా రోబోలకు ప్రసాదించే దిశగా మానవ సృష్టికర్తలు అడుగు వేస్తున్నారు.
ఇందులో భాగంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత సంస్థ “ఓపెన్ ఏఐ” న్యూరల్ నెట్వర్క్ మెషిన్ లెర్నింగ్ మోడల్ తయారు చేసేందుకు కృషి చేస్తోంది.ఈ కంపెనీకి ఎలన్ మస్క్ సహ-వ్యవస్థాపకులుగా ఉన్నారు.
ఇది GPT-3 AI అనే భాషా సామర్థ్యం కల్గిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను 2020లో అభివృద్ధి చేసింది.ఈ టెక్నాలజీ సహాయంతో రోబోలు పుస్తకాలు రాయడం, కంప్యూటర్ కోడింగ్, కవిత్వం రాయడం వంటి మానవుడికి మాత్రమే సాధ్యమైన పనులు సైతం చేస్తున్నాయి.

దీన్నిబట్టి మానవ సామర్థ్యాన్ని త్వరలోనే GPT-4 AI చేరుకుంటుందని టెక్నాలజీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మూడో తరం కృత్రిమ మేధస్సు అయిన “జీపీటీ-3” కష్టతరమైన అంశాలను సైతం చదివి అర్థం చేసుకోగలదు.అలాగే శిక్షణ ఇస్తే ఇది పత్రికా ప్రకటనలు, ట్వీట్లు, కంప్యూటర్ కోడ్ లను రాయడంలోనూ మనుషులకు సరిసమానంగా తన సత్తా చాటగలదు.సాధారణంగా పేపర్ అడ్వర్టైజ్ మెంట్స్ రాయాలంటే క్రియేటివ్ థింకింగ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే రోబోలు ఇప్పుడిప్పుడే ఆ పనులను చేయగలుగుతున్నాయి.ఇక త్వరలోనే ఇది మానవుడికి సమానంగా కవిత్వాలు, రచనలు, కథలు సైతం రాసి లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజులు గెలుచుకున్నా.
ఆశ్చర్యపోనక్కర్లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.కానీ రోబోలు ఇలాంటి స్థాయికి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
అలాగే ఇలాంటి రోబోలను సృష్టించిన మానవులకే ఎక్కువ గుర్తింపు దక్కే అవకాశముంది.ఏదేమైనా అది కూడా మానవ ఆలోచనల నుంచి పుట్టిన ఒక ఆవిష్కరణే కదా!!
.