లవ్ స్టోరీ.. అక్కినేని ప్రేమ నగర్ అంటున్న నాగార్జున?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి చిత్రం "లవ్ స్టోరీ".

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునీ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక నిన్న విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.ఇకపోతే నాగచైతన్య లవ్ స్టోరీ ట్రైలర్ పై నాగార్జున స్పందిస్తూ.

Advertisement

"లవ్ స్టోరీ" సినిమాను అక్కినేని నాగేశ్వరావు నటించిన "ప్రేమ నగర్" సినిమాతో పోల్చారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా నాగార్జున 1971 సెప్టెంబర్ 24వ తేదీ అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా విడుదల కాగా.2021 సెప్టెంబర్ 24 నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల కాబోతుందని.నాగచైతన్య లవ్ స్టోరీని నాగేశ్వరరావు ప్రేమనగర్ తో పోలుస్తూ.

లవ్ స్టోరీ చూడటానికి బాగుంది రా ఛై.ఆల్ ద బెస్ట్ అని నాగార్జున తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు