'బండి' యాత్ర పై బీజేపీ టెన్షన్ ? అదే జరిగితే ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో కొద్ది రోజులుగా చేపట్టిన పాదయాత్ర అనుకున్న మేర సక్సెస్ అవుతున్నట్టు గాని కనిపిస్తోంది.

ఆయన యాత్రకు భారీ సంఖ్యలో జనాలు హాజరు అవుతుండడంతో కేడర్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.

సంజయ్ యాత్ర ద్వారా తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పెరుగుతోందనే అంచనాలు అందరికీ వచ్చాయి అలాగే బీజేపీ అధిష్టానం సైతం ఈ యాత్ర పై భారీగానే ఆశలు పెట్టుకుంది.ఇప్పటికే అధిష్టానం నుంచి వచ్చిన ఆరుగురు సభ్యులు యాత్రను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు బిజెపి అధిష్టానానికి పంపుతున్నారు.

ఇప్పటివరకు సంజయ్ నిర్వహించిన పాదయాత్ర అనుకున్న మేరకు బాగానే సక్సెస్ అయిందని , ఆ పార్టీ నాయకుల్లో నమ్మకం ఏర్పడింది.సంజయ్ యాత్ర కు భారీ స్థాయిలో జనసందోహం ఉండేవిధంగా అన్ని ఏర్పాట్లు పార్టీ నాయకులు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున కార్యకర్తలు వెంట నడుస్తున్నారు.ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర ఏర్పాట్లను చేశారు.

Advertisement

దీనికోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలను నియమించారు.ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.

అయితే ఇప్పుడు బిజెపి నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.హైదరాబాద్ లో బిజెపికి గట్టి పట్టు ఉండడంతో ఈ యాత్ర ఇప్పటివరకు భారీగానే సాగినా, ఇప్పుడు హైదరాబాదు ను వీడి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాత్ర మొదలు కాబోతుండదాంతో అక్కడ ఈ స్థాయిలో జన సందోహం హాజరు అవుతారా అనేది కమలనాథుల ఆందోళన ఇప్పటి వరకు ఉన్న స్థాయిలో జన సందోహం లేకపోతే పాదయాత్ర ఫెయిల్ అయిందని , సంజయ్ ప్రభావం తగ్గిపోయింది అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసే అవకాశం ఉందని, సంజయ్ తో పాటు,  బిజెపి పెద్దలు టెన్షన్ పడుతున్నారట.

పాదయాత్ర మొదటి రోజు ఏ విధమైన జనసందోహం కనిపించిందో చివరివరకు అంతే స్థాయిలో జనాలు హాజరు కాకపోతే పాదయాత్ర ద్వారా వచ్చిన గ్రాఫ్ మొత్తం పడిపోతుందని,  ఇది మొదటికే మోసం వస్తుందనే టెన్షన్ సంజయ్ తో పాటు, బిజెపి హైకమాండ్ కు ఉందట.అందుకే ఈ పాదయాత్ర పర్యవేక్షిస్తున్న కమిటీలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ,  ఎక్కడా అ జనసందోహం తగ్గకుండా ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బిజెపి నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొనే విధంగా చూడాలంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడ్డాయట.ఏదో రకంగా తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపిని చూపించాలనే తాపత్రయం ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు