అదేదో చెట్టు కొమ్మ అనుకుని నిల్చున్నాడు.. తీరా చూస్తే..

ఈ సృష్టిలో ఏ జంతువు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.మ‌నం ఏమీ లేద‌నుకున్న చోట కూడా ఏదో ఒక జీవి రూపంలో అక్క‌డ ప్ర‌మాదం ఉంటుంది.

 Hes Standing There Thinking Its A Tree Branch If You Look At It. Python, Viral N-TeluguStop.com

ఇక అడ‌విలో అయితే అనువ‌ణువునా జీవ‌రాశుల‌తో నిండిపోయి ఉంటుంది.కానీ చూస్తే మాత్రం మ‌న‌కు పైకి ఏమీ లేన‌ట్టు గానే క‌నిపించినా కూడా అందులో ఏదో ఒక ప్రాణి ఉంటుంది.

ఇక మ‌న‌కు తెలియక అందులో ఏమీ లేద‌నుకుని చేసే తప్పు చివ‌ర‌కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం.ఎందుకంటే అక్క‌డ ఏదో ఉంద‌ని మ‌నం అనుకుంటాం గానీ ఇంకేదో ఉంటుంది.

ఇలాంటి పొర‌పాట్ల‌తోనే చాలామంది బ‌లైపోతుంటారు.ఇక నెట్టింట ఇలాంటి వింత ఘటనలు కొదువే ఉండ‌దు.అక్క‌డ నిత్యం ఏదో ఒక చిత్ర విచిత్ర ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు తిరుగుతూనే ఉంటాయి.ఇక ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంది.

ఆ వ్య‌క్తి చేసిన పొరపాటే చివ‌ర‌కు అతని ప్రాణాల మీద‌కు తెచ్చి ఆయ‌న్ను ప్రమాదంలో పడేసింది.ఆ వ్య‌క్తి స‌ర‌దాగా ఓ రోజు పార్క్‌కు వెళ్లాడు.

అయితే ఆ పార్కులో ప‌చ్చ‌గ‌డ్డి న‌డుమ ఓ భారీ కొండచిలువ ఉంది.కానీ దాన్ని అత‌డు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించ‌లేదు.

Telugu Fourteenfeets, Tree Branch, Python, Scotland-Latest News - Telugu

దాన్ని చూసి ఏదో విరిగిపోయిన చెట్టుకొమ్మ అనుకుని భ‌య‌ప‌డ‌కుండా ద‌గ్గ‌ర‌కు వెల్లాడు.అంతే కాదు దాని పక్కనే ఏదో ఆలోచిస్తూ నిల్చుని ఉండగా మెల్లిగా త‌న కాళ్లకు ఏదో తాకుతున్న‌ట్టు అనిపించ‌డంతో నేలవైపు క్షుణ్ణంగా పరిశీలించ‌గా గుండె ఆగినంత ప‌నైపోయింది.వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయేందుకు పరుగు లంకించుకున్నాడు.దాదాపుగా ఆ కొండ చిలువ 14 అడుగుల పొడవు ఉందంట‌.కానీ అత‌ను ధైర్యం తెచ్చుకుని ఆ కొండ చిలువ ద‌గ్గ‌ర‌కు వెళ్లి దాన్ని ఫొటో కూడా తీసుకున్నాడు.కాగా ఆ ఫొటో ఇప్ఉప‌డు వైర‌ల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube