పెళ్లి విషయంలో రెజీనా కోరిక ఇదే.. అలాంటి ఫ్యామిలీలోకి వెళ్లాలని..?

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా రెజీనా కెసాండ్రా నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో రెజీనాకు ఆఫర్లు తగ్గగా ప్రస్తుతం ఈ నటి శాఖినీ డాఖినీ సినిమాలో నటిస్తున్నారు.

శాఖినీ డాఖినీ సక్సెస్ సాధిస్తే నటిగా రెజీనాకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో రెజీనా కెసాండ్రా ఎక్కువగా నటించారు.

చెన్నై రెజీనా కెసాండ్రా స్వస్థలం కాగా రెజీనా బీఎస్సీ సైకాలజీ చదివారని సమాచారం.కాలేజ్ సమయంలో బాగా అల్లరి చేసిన ఈ బ్యూటీ సినిమాల్లో ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించారు.

అయితే కాలేజ్ వదిలిన ఐదు సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ కాలేజ్ లో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరయ్యారు.ఆ ఈవెంట్ కు హాజరయ్యే సమయానికి నటిగా మంచి పేరు వచ్చింది.

Advertisement

ప్రిన్సిపాల్, లెక్చరర్ చూపిన అభిమానానికి రెజీనా కళ్లు చెమర్చాయి.

ఆమె కంటి నుంచి ఆ క్షణాన వచ్చిన ఆనంద భాష్పాల గురించి ఏ విధంగా వర్ణించాలో కూడా ఆ సమయంలో రెజీనాకు అర్థం కాలేదని సమాచారం.ఆ సమయంలో కాలేజ్ జీవితం తర్వాత మధురమైన జీవితం ఉంటుందని అర్థమైంది.కాలేజ్ రోజుల్లో జీన్స్, టీషర్ట్ వేసుకొని వెళ్లిన రెజీనా మేకప్, జుట్టుతో సెలబ్రిటీలా వెళ్లడంతో ఆమె ప్రిన్సిపాల్ సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం.

సాంప్రదాయాలను గౌరవించే రెజీనా అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మేవారు.

పెళ్లి విషయంలో మాత్రం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె భావించేవారు.పెద్ద కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లాలని రెజీనా కోరిక కాగా ఆమె ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి కోరిక ఏర్పడిందని ఆమె భావిస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు