అమెరికాలో ఊహించని విపత్తు...22 మంది మృతి..!!

మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే.

అసలే కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లతో అల్లాడిపోతున్న పెద్దన్న అమెరికాను ప్రకృతి సైతం వెంటాడుతోంది.

నిన్నా మొన్నటి వరకూ అగ్ర రాజ్యంలో అడవి అగ్నికి ఆహుతి కాగా ,ఈ సంఘటలో లక్షల హెక్టార్లు కాలి బూడిద అయ్యాయి.అంతేకాదు కొందరు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటన నుంచీ కోలుకుంటున్న తరుణంలోనే కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడం అమెరికన్స్ ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది.అయితే ప్రస్తుతం అమెరికాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడి ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

తాజాగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరదలు ప్రజావాసాలలోకి రావడంతో వరదల్లో ప్రజలు చిక్కుకుపోతున్నారు.

Advertisement

ఈ క్రమంలో దాదాపు 22 మంది అమెరికన్స్ మృతి చెందినట్టుగా టెన్నెస్సీ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.ఈ వరదల ధాటికి వందల ఇళ్ళు మునిగిపోయాయని, సుమారు 50 మంది అమెరికన్స్ వరదల్లో కొట్టుకుపోయారని ప్రకటించారు.ఇదిలాఉంటే

వరదలు ముంచెత్తడంతో రోడ్లపైకి నీళ్ళు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.సహాయక చర్యలు చేపట్టే అవకాశం కూడా లేదని, కొద్ది రోజలు ఆగితేనే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడానికి అవకాసం లేదని అధికారులు తెలిపారు.నిన్నటి ఒక్కరోజులోనే దాదాపు 35 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, గడిచిన 40 ఏళ్ళ కాలంలో ఈస్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారని అంటున్నారు స్థానిక ప్రజలు.

అయితే రానున్న రోజుల్లో మరింత స్థాయిలో వర్షాలు కురిసే అవకాసం ఉందని, టెన్నెసీ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు