ప్రధాని మోడీ తో భేటీ అయిన తెలంగాణ గవర్నర్..!!

ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ సౌందర్ రాజన్ ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న పరిస్థితులు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న స్థితిగతులపై తోపాటు ఇతర అంశాలు గురించి ప్రధాని మోడీ తో చర్చించారు.సుమారు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు మోడీతో గవర్నర్ చర్చించినట్లు సమాచారం.

ఇదే క్రమంలో స్వయంగా తాను రాసిన ప్రైమ్ మినిస్టర్ టు పాండమిక్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని.ప్రధాని మోడీ కి అందించారు తమిళసై.ఈ సందర్భంగా కరోనా టైంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్నివిధాల సాయం అందిందని తెలిపారు.

వ్యాక్సినేషన్ ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రాలకు అందించడంలో కేంద్రం కీలకంగా రాణించింది అని స్పష్టం చేశారు.కరోనా కష్టకాలంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కితాబు ఇచ్చారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం కూడా సాంకేతిక పరిజ్ఞానం సరైన రీతిలో ఉపయోగించుకుని.కరోనా కట్టడి చేయగలిగింది అని తమిళనాడు గవర్నర్ తమిళ సై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు