షర్మిల బోనమెత్తింది అందుకేనా...

తెలంగాణలో రాజకీయాలు చేయాలని భావించిన వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రజలకు బాగా పరిచయం ఉన్న రాజకీయ నేత తన పార్టీలో చేరలేదు.

షర్మిల మాత్రం అధికార టీఆర్ఎస్ పై అధినేత కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంది.కానీ తన ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించడం లేదు.

తనను లెక్కచేయడం లేదు.కానీ చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు షర్మిల స్థానికత పై మాట్లాడుతున్నారు.

అసలు ఆమె ఇక్కడామె కాదని అంటున్నారు.దీంతో షర్మిల తన స్థానికతను నిరూపించుకునేందుకు తెలంగాణ పండుగల్లో ప్రత్యేకంగా పాల్గొంటుంది.

Advertisement

తెలంగాణ రాష్ర్ట ప్రజలకు బోనాలు ఎంత పెద్ద ఉత్సవమో అందరికీ తెలిసిందే.కాగా షర్మిల ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.

తన చిన్న నాటి స్నేహితురాలు ఇంట్లో షర్మిల బోనాల పండుగను జరుపుకోవడం విశేషం.ఈ ఏడు బోనాల పండుగ, స్నేహితుల దినోత్సవం ఒకే రోజు రావడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితులరాలింటికి వెళ్లింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత ప్రకారంగా.తాను స్నేహానికి ఎంతలా విలువిస్తానో చెబుతూనే తెలంగాణ పండుగలను గౌరవిస్తానని చెప్పకనే చెప్పారు.

ఇలా తాను చేయడం వల్ల తాను తెలంగాణ ఆడ బిడ్డనే అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.బోనాల ఉత్సవంలో పాల్గొనడమే కాకుండా రాష్ర్ట ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెబుతూ ఆమె ట్వీట్ చేయడం విశేషం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాగా.షర్మిల పార్టీ కార్యాలయంలో మహిళా నేత ఇందిరా శోభన్ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్షల పేరిట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు