సాయికుమార్ తల్లి పెళ్లికి ముందు ఎలాంటి జీవితం గడిపిందో తెలుసా?

సాయి కుమార్.తెలుగు జనాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే ఆశ్చర్యం కలగకమానదు.

నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన వ్యక్తి ఆయన.ఆయన గంభీరమైన వాయిస్ తో ఎలాంటి పాత్రలకైనా డబ్బింగ్ చెప్పి వారెవ్వా అనిపించాడు.తన తండ్రి పీజే శర్మ నుంచి తన కంఠం వారసత్వం సంపదగా సాయి కుమార్ కు వచ్చింది.

ఆయన కూడా మంచి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.సాయికుమార్ కు చిన్నప్పటి నుంచి తన తల్లి అంటే ఎంతో ప్రేమ.

ఆమెకు మన సంప్రదాయాలు అన్నా, పురాణాలు అన్నా.ఎంతో గౌరవం.

Advertisement

సాయి కుమార్ సహా మిగతా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పీజే శర్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.కనీసం పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉండేవాడు.

సాయి కుమార్, ఆయన పెద్ద చెల్లెలు స్కాలర్ షిప్ తోనే చదువుకున్నాడు.ఆయన ఎప్పుడూ టెక్ట్స్ పుస్తకాలు కొనేవాడు కాదు.

తన సీనియర్స్ దగ్గర తెచ్చుకుని చదువుకునేవాడు.మధ్యాహ్నం పూట వారికి వాళ్లమ్మ గోధుమన్నం బాక్సులో పెట్టి ఇచ్చేది.

అది తిన లేక సాయికుమార్ చెల్లి ఏడ్చేది.తినడానికి సరిగా ఫుడ్ కూడా ఉండేది కాదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయినా తన తల్లి వీరిని మంచి వారిగా తీర్చిదిద్దింది.

Advertisement

సాయి కుమార్ తండ్రి పీజే శర్మ రైల్వే ఉద్యోగి.విజయనగరంలో ఉద్యోగం చేసేవాడు.అక్కడే జేవీ సోమయాలుజులు, రమణ మూర్తితో కలిసి నాటకాలు వేసేవాడు.

నటన మీద ఆసక్తితో మద్రాసు వెళ్లి చిన్న చిన్న వేషాలు వేసేవాడు.అనంతరం 1959లో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసులు స్థిరపడ్డాడు.

సాయికుమార్ వాళ్లమ్మ ఒకప్పుడు మహారాణిలా బతికారు.వాళ్లది కర్నాటకలోని బాగేపల్లి.

ఆమె ముత్తాతలు మైసూరు రాజుల దగ్గర పనిచేసేవారు.పెళ్లికి ముందు ఆమె పోలో ఆడేవారు.

శర్మ కోసం అన్ని వదులుకుని వచ్చారు.వారిద్దరినీ రంగస్థలం కలిపింది.

ఓసారి అనార్కలీ వేషం వేసిన ఆమెను చూసి శర్మ చాలా ఇష్టపడ్డారు.అదే నాటకాల పోటీలో శర్మ శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుగా చేశారు.

అలా ఇద్దరు పరిచయం అయ్యారు.అనంతరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

వీరికి మొత్తం ఐదుగురు సంతానం.వారిలో సాయికుమార్ పెద్దవాడు.

తాజా వార్తలు