నాన్న నా వల్ల నష్టపోయాడన్నారు.. బాలు కొడుకు సంచలన వ్యాఖ్యలు?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్ గాయకుడు కావాలని అనుకోకపోయినా గాయకుడై తండ్రిలా పాడుతున్నాననే పేరును సంపాదించుకున్నారు.

నిర్మాతగా ఎస్పీ చరణ్ కొన్ని సినిమాలను నిర్మించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.

కెరీర్ లో చరణ్ నిలదొక్కుకుంటున్న సమయంలో తండ్రి మృతిచెందారు.కొడుకు వల్ల ఎస్పీ బాలు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చరణ్ గురించి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు తండ్రిలా పాటలు పాడుతూ ఎంత బాగా పాడుతున్నారనే పేరును సొంతం చేసుకున్నారు.నాన్న తనను కష్టపడుతున్నా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని మంచిరోజుల కోసం ఎదురుచూడాలని చెప్పారని ప్రస్తుతం పాడుత తీయగా కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిసున్నానని బాలు కొడుకు చెప్పుకొచ్చారు.

నాన్న ప్రస్తుతం జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారని చరణ్ పేర్కొన్నారు.చెన్నైలో తాను పుట్టిపెరిగానని ఉమ్మడికుటుంబం కావడంతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేదని చరణ్ తెలిపారు.

Advertisement

పదో తరగతి చదివిన తర్వాత తనను అమెరికాకు పంపించారని చదువు పూర్తయ్యాక ప్రొడక్షన్ కంపెనీని పెట్టానని చరణ్ చెప్పుకొచ్చారు.నిర్మాతగా ఉన్నై శరణైడేందవ్ అనే సినిమాను తీయగా ఆ సినిమాకు అవార్డులు వచ్చినా లాభాలు రాలేదని చరణ్ వెల్లడించారు.

ఆ తర్వాత చెన్నై 600028 సినిమా తీశామని ఆ సినిమా హిట్ కావడంతో పాటు భారీగా లాభాలు వచ్చాయని చరణ్ తెలిపారు.తన సినిమాకు లాభాలు రాకపోవడంతో నా వల్లే బాలు గారు ఆస్తులు అమ్ముకున్నారని ప్రచారం జరిగిందని చరణ్ చెప్పుకొచ్చారు.పత్రికల్లో అలా రావడంతో తాను అపరాధ భావానికి లోనయ్యానని నేను ఎంత కష్టపడ్డానో నా మనస్సాక్షికి తెలుసని చరణ్ చెప్పుకొచ్చారు.

సంగీతం వల్లే తాను కోలుకున్నానని చరణ్ చెప్పుకొచ్చారు.అక్క పల్లవి చిన్నప్పటి నుంచి బాగా చదివేదని అమ్మకు ఏవైనా చెప్పుకోలేకపోతే అక్కకు చెప్పుకుంటానని ఎస్బీ చరణ్ అన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు