ఏపీ తెలంగాణ పై ప్రశాంత్ కిషోర్ 'ముద్ర ' ! అన్ని పార్టీలకూ వారే ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరం గా మారింది.ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా, అప్పుడే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసినట్లుగా అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి.

ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రతరం చేసుకోవడంతో పాటు, ప్రజల్లో తమ బలం తగ్గకుండా చూసుకుంటున్నారు.తమ ప్రత్యర్థులను ఎదుర్కునేందుకు తమ బలం ఒకటే సరిపోదని,  దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యూహ కర్తలను నియమించుకుంటే తమకు టెన్షన్ ఉండదు అనే ఆలోచనతో,అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ కర్తలను నియంచుకుని, అధికారానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త సహకారం తీసుకుంది.ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతో వైసిపి ముందుకు వెళ్ళడంతో, ఏపీలో అఖండ మెజార్టీతో వైసీపీ విజయం సాధించగలిగింది.

      దీంతో వ్యూహకర్తల ఆలోచన అన్ని పార్టీలకు వచ్చింది. టిడిపి కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసి బయటకు వచ్చిన రాబిన్ శర్మ అనే వ్యూహకర్త ను నియమించుకుంది.

Advertisement

ఇక తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైయస్ షర్మిల ప్రశాంత్ కిషోర్ టీం లో పనిచేస్తున్న  ప్రియా నియమించుకుంది.ఇక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పుడు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో, వ్యూహకర్త ను నియమించుకోవాలనే ఆలోచనలో ఉంది .అది కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన వారిని ఎంపిక చేయాలని చూస్తోంది.ఇక ఎలాగూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా ఉండేందుకు పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.   

    ఇటీవల రాహుల్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం తో ఒక దశలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది.ఒకవేళ కాంగ్రెస్ తరఫున అధికారికంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకుంటే, ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ కు ఉంటుంది.ఇలా అన్ని పార్టీలు వ్యూహ కర్తలను నియమించుకోవడం,  అది కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచే ఎంపిక చేయడం చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో పై ఎంతగా ఉందో అర్థం అవుతోంది.

ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ వ్యూహ కర్తలుగా ఉన్నవారంతా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.   .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు