తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న ఎస్బిఐ..!

కరోనా కష్టకాలంలో సైబర్ నేరాలనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి.ఆన్ లైన్ లో అనేక రకాల దోపిడీలు జరుగుతున్నాయి.

చాలా మంది ఈజీ మనీ కోసం ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు.అందుకే సైబర్ నేరాలపై పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

వివిధ బ్యాంకులకు అప్రమత్తత వహించాలని కోరుతున్నారు.తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన యూజర్లకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది.

దేశంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం కొన్ని కొత్త నిబంధనలను తెచ్చింది.ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లలో అనేక రకాల మోసాలనేవి జరుగుతున్నాయి.

Advertisement

ఆన్‌ లైన్ మోసాలనేవి పెరుగుతున్న తరుణంలో తాజాగా ఎస్బీఐ ఓ కీలక సందేశాన్ని తన కస్టమర్లకు తెలియజేసింది.తమ ఖాతాదారులకు కొన్ని కఠిన నియమాలు, నిబంధనలను తీసుకొచ్చింది.

ఎస్‌బీఐ యోనో యాప్ వాడుతున్నవారికి కొన్ని కఠిన నిబంధనలను తెలియజేసింది.ఆన్‌ లైన్ లో మోసాలు అనేవి ఎక్కువైపోతున్నాయి.

అనేక కారణాల వలన చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు.తమ బ్యాంకు ఖాతాదారులు చాలా సంతోషంగా ఉండటం కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

కొత్త నిబంధనలు పాటించడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఒకవేళ ఆ నిబంధనలను పాటించకపోయినట్లైతే వారి అకౌంట్లు బ్లాక్ అయిపోతాయని.ఎస్‌బీఐ యోనో యాప్ లోకి లాగిన్ కావడానికి ముందుగా ఎస్‌బీఐ అకౌంట్ ఉన్నవారు కొన్ని నిబంధనలు పాటించాలని తెలిపింది ఎస్బిఐ.ఇక నిబంధనలు విషయానికి వస్తే.

Advertisement

బ్యాంకుతో లింకు చేసిన మొబైల్ ఫోన్ నెంబరు గల మొబైల్ ద్వారానే ఎస్‌బీఐ యోనో యాప్ ను ఖాతాదారులు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ ఆ నంబర్ తో కాకుండా వేరే నంబర్ తో లాగిన్ అయ్యినట్లైతే యోన్ యాప్ వారికి అంగీకారం తెలపదు.

అలాగే ఎటువంటి లావాదేవీలు నిర్వహించడానికి ఎస్‌బీఐ యోనో ఏ రకంగానూ అనుమతించదని చెప్పొచ్చు.ఎస్‌బీఐ తమ కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఈ విషయంపై ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుసుతుంది.

తాజా వార్తలు