లాంగ్ హెయిర్ కావాలా? అయితే ఈ ఆకులు వాడాల్సిందే!

అమ్మాయిల్లో లాంగ్ హెయిర్ కోసం తాప‌త్రాయ ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. పొడ‌వాటి జుట్టు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తుంది.

అబ్బాయిలు కూడా పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిల‌ను తెగ లైక్ చేస్తుంటారు.కొంద‌రైతే కవిత‌లూ వ‌ల్లిస్తుంటారు.

అందుకే చాలా మంది జుట్టు పొడుగ్గా పెర‌గాల‌ని కోరుకుంటారు.అయితే జుట్టు బారుగా పెరిగేలా చేయ‌డంలో కొన్ని కొన్ని ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆకులు ఏంటీ.? వాటిని ఎలా యూజ్ చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చింతాకు జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరిగేలా చేయ‌డంతో గ్రేట్ స‌హాయ‌ప‌డుతుంది.ఒక క‌ప్పు చింతాకు తీసుకుని అందులో కొద్దిగా మ‌జ్జిగా పోసి కాసేపు నాన‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత మ‌జ్జిగాతో పాటుగా చింతాకును పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో గోరింటాకు పొడి వేసి బాగా క‌లిపి త‌ల‌కు మ‌రియు జుట్టు మొత్తానికి ప‌ట్టించి.అర గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు క్ర‌మంగా పెరుగుతుంది.అలాగే తుల‌సి ఆకులు కూడా పొడ‌వాటి జుట్టును అందించ‌గ‌ల‌దు.

కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా నూరి పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొబ్బ‌రి నూనె క‌లిపి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించాలి.న‌ల‌బై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.

Advertisement

ఇలా చేసినా జుట్టు పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.

ఇక జామ ఆకుల‌ను తీసుకుని.మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో అవ‌కాడో పండు గుజ్జు మ‌రియు బాదం ఆయిల్ వేసుకుని క‌లిపి.

జుట్టుకు ప‌ట్టించాలి.ముప్పై నిమిషాల అనంత‌రం త‌ల స్నానం చేయాలి.

ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు