అమెరికా: ప్రఖ్యాత ఎన్ఆర్‌డీసీ సీఈవోగా భారత సంతతి పర్యావరణ వేత్త

భారత సంతతికి చెందిన పర్యావరణ వేత్త మనీష్ భాప్నా అమెరికాలోని ప్రతిష్టాత్మక Natural Resources Defence Council (NRDC)కి సీఈవో, అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆగస్టు 23న ఆయన తన బాధ్యతలను స్వీకరించనున్నారు.

25 ఏళ్ల కెరీర్‌లో భాప్నా.వాతావరణ మార్పు, అసమానత వంటి సవాళ్లను పరిష్కరించడంలో సమర్దుడిగా నిరూపించుకున్నారని ఎన్ఆర్‌డీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

భాప్నా నుంచి సవాళ్లు ఎదుర్కోవడం, నైపుణ్యాలు, పరివర్తన మార్పు, లోతైన అవగాహన వంటి విషయాలను నెర్చుకోవాలని ఎన్‌ఆర్‌డీసీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ కాథ్లీన్ ఎ వెల్చ్ తన స్వాగత సందేశంలో పేర్కొన్నారు.ఇదీ మనీష్ ప్రస్థానం: వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న థింక్ టాంక్ వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా 14 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌ఐలో తన చివరి పనిదినం సందర్భంగా ఆయన ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

మనీష్ భాప్నా.అమెరికాలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎంఐటీ, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, హార్వర్డ్ బిజినెస్‌ స్కూల్‌లో చదువుకున్నారు.

Advertisement

ఆలీవర్ వైమన్ వద్ద అసోసియేట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.అనంతరం మెకిన్సే అండ్ కంపెనీలో చేరారు.

ఆ తర్వాత ప్రపంచ బ్యాంకులో సీనియర్ ఎకనామిస్ట్‌గా ఏడేళ్లు పనిచేసి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇక ఎన్‌ఆర్‌డీసీ విషయానికి వస్తే.గత 51 సంవత్సరాలుగా పర్యావరణ మార్పులపై క్షేత్రస్థాయి కార్యకలాపాలను ఈ సంస్థ చేపట్టింది.భారత్‌లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎన్ఆర్‌డీసీ కృషి చేసింది.

భారత్ ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలను అత్యధికంగా వెలువరించే దేశాల్లో మూడవ స్థానంలో వున్న సంగతి తెలిసిందే.అటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఇంధన వనరులు, సమర్థవంతమైన భవనాల నిర్మాణం విషయంలో ఎన్ఆర్‌డీసీతో కలిసి పనిచేస్తోంది.దేశంలోని ఎన్నో నగరాలు చల్లటి వాతావరణం కోసం ఎన్ఆర్‌డీసీ హీట్ యాక్షన్ ప్లాన్‌ను అనుసరించాయి.2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో భారత ప్రభుత్వానికి ఈ సంస్థ సహాయపడుతోంది.గతేడాది నవంబర్‌లో వాతావరణ చర్యలను వేగవంతం చేసినందుకు గుర్తింపుగా ఎన్ఆర్‌డీసీకి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎర్త ఫండ్ నుంచి 100 మిలియన్ల గ్రాంట్ లభించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు