40 లో ప్రెగ్నెన్సీ 105 కేజీల బరువు పెరిగిన నటి.!
ప్రెగ్నెన్సీ జర్నీ వివరించిన నటి సమీరారెడ్డి.
ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ తో మహిళల్లో అనేక శరీర మార్పులు చోటు చేసుకుంటాయి.దీంతో ఆందోళన చెందటం బరువు పెరగడం చాలా మంది మహిళల్లో సహజంగా జరిగేవే కానీ సెలబ్రిటీలు విషయానికి వచ్చేసరికి వాళ్ళకు సంబంధించిన ప్రతి అంశం సెన్సేషన్ అయిపోతుంది.
వాళ్ళు బరువు పెరిగినా తగ్గినా సరిగ్గా రిసీవింగ్ ఉండదు.మరి ఆంటీలా కనిపిస్తున్నవంటు నోటికి ఏదొస్తే అది వాగుతూ ట్రోల్ చేసేస్తుంటారు.
సమీరా రెడ్డి సైతం ఇలాంటి మెసేజ్ ను ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు.
తాజాగా తను గర్భవతి గా ఉన్నప్పుడు చోటు చేసుకున్న మార్పులు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు పై నటిసమీరారెడ్డి స్పందించారు.
బిడ్డకు జన్మనివ్వడం అన్నది చాలా గొప్ప విషయం.ఆ మధుర క్షణాలన్నింటిని ఆస్వాదించండి.
శరీరం లో మార్పులు చోటు చేసుకోవడం సహజమే.బరువు పెరగడంతో ఒత్తిడి లోనవుతారు చాలామంది.నా విషయంలోనూ ఇలాంటి జరిగాయి.40 ఏళ్ళ వయస్సులో ప్రెగ్నెన్సీ అవ్వడంతో భయపడ్డాను.హన్ష్ పుట్టిన తర్వాత నేను దాదాపు 105 కేజీల బరువు పెరగాను.సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు దీంతో తెలియకుండానే ఒకింత డిప్రెషన్లోకి వెళ్లి పోయాను.
ఎవరో ఏదో అంటే నేను ఎందుకు బాధ పడాలని మెల్లమెలగా దాన్నుంచి బయటపడ్డాను.