తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమిళ బ్యూటీ “శృతి హాసన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే తెలుగు గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికంటే ముందుగా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.
దీంతో స్టార్ హీరో కూతురు అయినప్పటికీ అవకాశాల విషయంలో బాగానే ఇబ్బందులు ఎదుర్కొంది.కానీ పట్టు విడవకుండా శ్రమించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, మాస్ మహారాజా రవితేజ, తదితర స్టార్ హీరోల సరసన నటించింది.
కాగా ఆ మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు “రాఘవ లారెన్స్” కాంబినేషన్లో తెరకెక్కిన “రెబల్” చిత్రంలో కూడా ఈ అమ్మడికి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట.
కానీ ఆ సమయంలో శృతి హాసన్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుందట.దాంతో ఈ అవకాశం మిల్కీ బ్యూటీ తమన్నా ని వరించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఆ విధంగా శృతి హాసన్ డిజాస్టర్ నుంచి తప్పించుకుంది.

కానీ ప్రస్తుతం మళ్లీ ఈ అమ్మడికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం తలుపుతట్టింది.దీంతో ఈ సారి శృతి హాసన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ మరియు కే.జి.ఎఫ్ చిత్ర దర్శకుడు “ప్రశాంత్ నీల్” కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “సలార్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రం కోసం శృతి హాసన్ దాదాపుగా పదిహేను 15 కోట్ల రూపాయలకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.