సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వాడే దుస్తులు, వస్తువుల కోసం కొన్నిసార్లు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా నటిగా అనుష్క శర్మ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుష్క తరచూ ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో పాటు కీలక విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ లో భర్త కోహ్లీ, కూతురు వామికాతో కలిసి అనుష్క శర్మ అన్నారు.
తాజాగా ఒక పార్క్ లో అనుష్క, కోహ్లీ కూతురు 6వ నెలకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ప్రస్తుతం అనుష్క శర్మ ఇంగ్లండ్ లోని కీలక ప్రాంతాలను భర్తతో కలిసి సందర్శించారు.
తల్లైన తరువాత అనుష్క శర్మ కుటుంబానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనార్హం.

తాజాగా అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ సెల్ఫీని షేర్ చేయగా అందులో అనుష్క శర్మ ఖరీదైన వాచ్ ను పెట్టుకుని కనిపించారు.బ్లాక్ అండ్ వైట్ టాప్ లో అనుష్క శర్మ ఫోజులివ్వగా అనుష్క ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ వాచ్ ధర తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
మన కరెన్సీ ప్రకారం ఈ వాచ్ ధర ఏకంగా 50 లక్షల రూపాయలు కావడం గమానార్హం.అనుష్క వాచ్ కోసమే ఇంత ఖర్చు చేస్తున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ పెట్టుకుంటే సమంత బ్యాచ్ మొత్తం సెటిలైపోతుందని చెప్పినట్టుగా అనుష్క శర్మ వాచ్ డబ్బులతో కూడా ఒక ఫ్యామిలీ సులభంగా సెటిల్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అనుష్క శర్మ పరిమితంగా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనార్హం.