సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళ.. మెరుపువేగంతో కాపాడిన వ్యక్తి!

కొన్ని కొన్ని సార్లు మనం ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా పరిస్థితులు చేయి దాటి పోతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో కూడా మనకు తోచదు.

ఇంకా కొన్ని సందర్భాల్లో మన స్వీయ తప్పిదం మూలానే మనం రిస్క్ లో పడతాం.ఎవరైనా వచ్చి మనల్ని కాపాడితే హమ్మయ్యా.

మనకు ఈ భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి అని దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుని హ్యాపీగా ఫీలవుతాం.ఎవరూ కాపాడకపోతే ప్రాణాలు కోల్పోవడమే, తీవ్ర గాయాలపాలయి ఆస్ప్రతిలో చేరడమో జరుగుతుంది.

అలా కాకుండా ముందుగానే ఇలా ప్రమాదం సంభవించే పనులు చేయకపోవడం ఉత్తమం అని మన పెద్దలు చెబుతారు.ముంబైలోని సముద్రం వద్ద సేదతీరుతూ కూర్చున్న ఓ మహిళ సడెన్ గా నీళ్లలోకి పడిపోయింది.

Advertisement

తర్వాత ఏం జరిగిందంటే.ముంబై మహానగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

సెల్ఫీలు తీసుకుంటూ సముద్రపు గోడపై కూర్చున్న 55 ఏళ్ల పల్లవి ముండే అనే మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయింది.అయితే అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఇది చూసి వెంటనే స్పందించాడు.

ప్రాణాలకు తెగించి మరీ మహిళను సేవ్ చేశాడు.తనకు ఒక్కసారగి కళ్లు బైర్లు కమ్మి తాను నీటిలోకి పడిపోయానని పల్లవి వాపోయింది.

అక్కడే ఉన్న గులాబ్‌చంద్‌ గోండ్‌ అనే ఫొటో గ్రాఫర్ ఇది గమనించి కాపాడడంతో ఆమె బతికి బట్టగలిగింది.తాడు సహాయంతో గులాబ్ చంద్ గోండ్ పల్లవిని కాపాడాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ లేపుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇది చూసిన పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఫొటో గ్రాఫర్ ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు