ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల చనిపోయిన కత్తి మహేష్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు.గత నెల 26వ తారీఖున నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కి భారీగా గాయాలు అవ్వడం తెలిసిందే.
హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రిలో జాయిన్ చేయగా అప్పటికే కత్తి మహేష్ ఆరోగ్యం విషమించడంతో అక్కడి వైద్యుల సలహాల మేరకు చెన్నైకి తరలించారు.ఈ క్రమంలో సర్జరీలు అంతా సక్సెస్ ఫుల్ గా జరిగాయని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు కూడా తెలిపారు.
అయితే ఇంతలోనే కత్తి మహేష్ మరణించడంతో చాలామంది షాక్ కు గురయ్యారు.

ఇటువంటి తరుణంలో మందకృష్ణ మాదిగ కత్తి మహేష్ మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారులో ముందు సీట్లో ఒక కత్తి మహేష్ మాత్రమే చనిపోవడం మరోపక్క ఆయన పక్కనే కూర్చున్నా వేరే వ్యక్తి.మరణించక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అని అంటున్నారు.
అంతేకాకుండా సదరు వ్యక్తికి ఒక గాయం కూడా కాలేదని అన్నారు.కత్తి మహేష్ కి బయట ఎంతో మంది శత్రువులు ఉన్నారని.
ప్రమాదం జరిగిన సమయంలో కత్తి మహేష్ కి ఎటువంటి గాయాలు కాలేదని ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై దారుణమైన పోస్టులు పెట్టారు అని మందకృష్ణ మాదిగ తెలిపారు.ఈ క్రమంలో కత్తి మహేష్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.