తెలంగాణ నిరుద్యోగ యువత కోసం వైయస్ షర్మిల సంచలన నిర్ణయం..!!

వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మేటర్ లోకి వెళితే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టడానికి వైయస్ షర్మిల రెడీ అయింది.

రాష్ట్రంలో ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో.ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకి అండగా ఉంటూ మరోపక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించే రీతిలో వైయస్ షర్మిల ఈ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న టాక్.

ఈ ఏడాది ఏప్రిల్ 15 తారీకు దాదాపు 72 గంటల పాటు షర్మిల దీక్ష చేపట్టిన గాని ప్రభుత్వం లో  స్పందన రాకపోవడంతో.ఇక ప్రతి మంగళవారం "నిరుద్యోగ దీక్ష" చేపట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వంలో కదలిక వచ్చే వరకు ఈ దీక్ష తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ చేపట్టనున్నట్లు.పార్టీలో కీలక నేతలు తెలిపారు.

Advertisement

లోటస్ పాండ్ లో.ఈ దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ టీపీ అడహక్‌ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్‌ ఖాన్, కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కేవలం ఎన్నికల టైంలో మాత్రమే హామీలు ఇచ్చిన.టిఆర్ఎస్ పార్టీ మాట నిలుపుకునేలా.

ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు