షర్మిలపై ఏపీ ముద్ర ? ముందు ముందు ముళ్ళ బాటే ?

ఎట్టకేలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేయబోతున్నారు.

ప్రజల్లో బలం పెంచుకుని తెలంగాణలో తిరుగులేని పార్టీగా మారేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

ప్రజల మెప్పు పొందేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ను హైలెట్ చేస్తున్నారు.ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు నిరుద్యోగ సమస్య పై ఎక్కువగా ఆమె మాట్లాడుతున్నారు.

క్రమక్రమంగా తెలంగాణ ప్రజల్లో తనదైన ముద్ర వేసేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్, టిఆర్ఎస్ బిజెపి వంటి అతి పెద్ద పార్టీలను ఢీ కొట్టేందుకు ఏమాత్రం ఆమె వెనకాడడం లేదు.

అయితే రాజకీయంగా షర్మిల తాను అనుకున్న స్థానానికి వెళ్ళడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు.ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిందే.

Advertisement

ఆ సవాళ్లను ఎదుర్కుంటూనే తెలంగాణ ప్రజలు చెరగని ముద్ర వేయగలిగితేనే ఆమె పార్టీకి మనుగడ ఉంటుంది.దీని కోసం ఆమె ఆషామాషీగా రాజకీయాలు చేస్తే కుదరదు .పూర్తిగా ఆమె తెలంగాణ వాదిగా మారిపోవాలి.యాస , భాష మార్చుకోవాలి.

టిఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు తిరుగులేకుండా ఉంది అంటే, అది కేసీఆర్ వాక్చాతుర్యమే.సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతూ, లబ్ధి పొందుతూ ఉంటారు.

ఇప్పుడు ఆ తరహాలోనే షర్మిల కూడా సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్ధి పొందడం ఎంతైనా అవసరం.అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా వైఎస్ కు అనుకూలంగా ఉండేది.

ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం లో చీలిక వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

కొంతమంది కాంగ్రెస్ , బిజెపి ఇంకొంత మంది టిఆర్ఎస్ లో చేరిపోయారు.ఆ పార్టీ లోని నాయకులను షర్మిల తమ పార్టీలో కి వచ్చే విధంగా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.అలాగే ఆ సామాజికవర్గం అండదండలు ఉండేలా ఆమె చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

అయితే ఇవన్నీ ఆషామాషీగా జరిగే వ్యవహారాలు కాదు.పూర్తిగా ఆమె ఏపీ వ్యక్తిగా ముద్ర ఉంది.

ఇప్పటికీ ఆమెను ఏపీ వ్యక్తిగానే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉండడం, మొన్నటి వరకు ఆమె పులివెందుల బిడ్డనే అంటూ అనేక సందర్భాల్లో ప్రస్తావించడం, తదితర కారణాలు ఆమెకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

అలాగే కేసీఆర్ సూచనల మేరకు షర్మిల పార్టీ పెట్టారు అనే ప్రచారం జరుగుతుండటంతో దానికి చెక్ పెట్టే విధంగా ఆమె వ్యవహరిస్తూ, తాను పూర్తిగా తెలంగాణ ప్రజల కోసమే రాజకీయ పార్టీని పెట్టాను అని, రాజన్న పరిపాలన తీసుకువచ్చేందుకు తాను రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి ఇబ్బందులు పడుతున్నాను అనే విషయాన్ని ఆమె తెలంగాణ ప్రజల ముందు నిరూపించుకోవాల్సి వస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది.లేకపోతే చిన్నా చితకా పార్టీల లిస్ట్ లోకే వైఎస్సార్ టీపీ కూడా చేరిపోయే అవకాశం లేకపోలేదు.

తాజా వార్తలు