ఆరెంజ్ లాంటి సినిమా కావాలంటున్నారు.. బొమ్మరిల్లు భాస్కర్!

సిద్ధార్థ,జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో 2006 సంవత్సరంలో విడుదలైన సినిమా "బొమ్మరిల్లు" ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కాసుల వర్షం కురిపించింది.

ఈ సినిమా ఇంత విజయవంతం కావడంతో దర్శకుడికి పేరు ముందు బొమ్మరిల్లు పడి బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయారు.ఎంతో మంచి సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు భాస్కర్ ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా "పరుగు" సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఈ విధంగా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన బొమ్మరిల్లు భాస్కర్ మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అంటే అందరి అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ క్రమంలోనే జెనీలియా, రామ్ చరణ్ జంటగా భాస్కర్ దర్శకత్వంలో "ఆరెంజ్" సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆడియో విడుదల చేసింది.

Advertisement

ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల మదిని దోచాయి.ఆ పాటలకు అపూర్వ విశ్లేషణ దక్కడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఎట్టకేలకు వీరి కాంబోలో వచ్చిన ఆరెంజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శక నిర్మాతలు.అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలను తాక లేకపోయింది.ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలైంది.

చెప్పాలంటే ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో ఒక డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కెరియర్ పై ఈ సినిమా ప్రభావం చూపించింది.

ఇకపోతే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర అప్పుల పాలయ్యారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆరెంజ్ సినిమా పెద్దగా ఆడకపోయినా ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ తన కెరీర్లో ఆరెంజ్ సినిమా ఎప్పటికీ ఒక స్పెషల్ చిత్రమని తెలియజేశారు.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాము.

Advertisement

ఈ సినిమా కోసం కష్టపడినంతగా తను ఏ చిత్రానికి కష్టపడ లేదని తెలిపారు.అయితే ఇప్పటికీ కొందరు ప్రేక్షకులు ఆరెంజ్ లాంటి సినిమా తీయాలని అడుగుతున్నారు.

ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంది.అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం దారి తప్పడంతో ఈ సినిమా ఆడలేదని తెలియజేశారు.

తాజా వార్తలు