ఈ మధ్య పెళ్లి పందిరిలో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.పెళ్లి కి వచ్చే అతిధులు ఇచ్చే గిఫ్ట్స్ చూసి ఆశ్చర్య పోవడం పెళ్లి చేసుకునే వారివంతు అవుతుంది.
వింత వింత గిఫ్ట్స్ ఇస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.ఇలాంటి బహుమానాలు కూడా ఇవ్వొచ్చని కొంతమంది నిరూపిస్తున్నారు.
అవి కాస్త వైరల్ అవుతున్నాయి.తాజాగా ఇలాంటి వింత సంఘటనే ఒకటి జరిగింది.
పెళ్లికి ఎవరైనా ఏమి ఇస్తారు.ఇంట్లో కు సంభదించినవి కానీ లేకపోతే గోల్డ్ ఐటమ్స్ కానీ అది కాకపోతే వెండి వస్తువులు ఇస్తారు.కానీ ఒక పెళ్ళిలో మాత్రం పెళ్లి కొడుకు స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చేసి వధూవరుల నోటి వెంట మాట కూడా రాలేదు.అలా ఏమి ఇచ్చి ఉంటాడా అని ఆలోచిస్తున్నారా.
అదే నండి ఇప్పుడు విలువైన వాస్తులో ఒకటి అయిన పెట్రోల్.

అవును మీరు విన్నది నిజమే.పెళ్లి కి వచ్చిన పెళ్లి కొడుకు స్నేహితులు వధూవరులకు పెట్రోల్ కానుకగా ఇవ్వడంతో బంధువులతో పాటు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోయారు.ఈ సంఘటన జనగామ జిల్లాలో శనివారం రోజు జరిగిన పెళ్ళిలో చోటు చేసుకుంది.
మహేష్, సుస్మిత పెళ్ళికి హాజరైన బాల్య మిత్రులు ఒక లీటర్ పెట్రోల్ ను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు గిఫ్ట్ గా ఇచ్చారు.

అసలే సెంచరీ దాటిన పెట్రోల్ ను జాగ్రత్తగా వాడుకోమని చెప్పి మరి వధూవరులకు కానుకగా అందించారు.దీంతో వధూవరులు ఆశ్చర్య పోయారు.ఇంత విలువైన కానుకను జాగ్రత్తగా వాడుకుంటామని పెళ్లి కొడుకు వారి స్నేహితులకు చెప్పాడు.
వీళ్ళు చేసిన పనికి ఇప్పుడు ఈ వార్త కాస్త ఆ నోటా ఈ నోటా పడి వైరల్ అయ్యింది.ఇది ఇప్పుడు కొత్తేమి కాదు.ఈ మధ్య ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.అదే ట్రెండ్ ను వీళ్ళు కూడా ఫాలో అయ్యారు.