రజనీపై నటి సంచలన పోస్ట్.. అక్కడికెళ్లడం మిస్టరీ అంటూ..?

స్టార్ హీరో రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంత్ ఆసక్తి చూపలేదు.

ఇప్పటికే అన్నాత్తే మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన రజనీకాంత్ అనారోగ్య సమస్యల వల్ల అమెరికాకు వెళ్లారు.అయితే రజనీకాంత్ ఆమెరికాకు వెళ్లడంపై ప్రముఖ నటి కస్తూరి ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న కస్తూరి సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్ గా ఉంటారు.బుల్లితెరపై సీరియళ్ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కస్తూరి అమెరికా చాలారోజుల నుంచి ఇండియన్స్ ను అనుమతించడం లేదని రజినీ మాత్రం అక్కడికి ఎలా వెళ్లారని అమెరికాలోని మోయో క్లినిక్ కు వెళ్లడానికి ఆయనకు అనుమతి ఎలా లభించిందని ప్రశ్నించారు.

అమెరికాకు వెళ్లాలంటే ఎంబసీ అనుమతి కచ్చితంగా ఉండాలని హెల్త్ ఎమర్జెన్సీ అయినా అమెరికా అంగీకరించడం లేదని కస్తూరి పేర్కొన్నారు.రజనీకాంత్ ప్రయాణం గురించి ఆలోచిస్తే పిచ్చెక్కుతుందని ఆమె వెల్లడించారు.మేయో క్లినిక్ అంటే గుండెకు సంబంధించిన క్లినిక్ అని అసలు రజనీకాంత్ ఆరోగ్య సమస్య ఏమిటని కస్తూరి ప్రశ్నించారు.

Advertisement

రజనీకాంత్ కు నిబంధనలు వర్తించవా ? అని ఆమె ప్రశ్నించారు.

రజనీకాంత్ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని గతంలో జరిగినవి తలచుకునే తాను ఈ పోస్ట్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.రజనీ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్య సమస్యను తెలుసుకోవాలనుకోవడమే తన ప్రయత్నమని కస్తూరి చెప్పుకొచ్చారు.కస్తూరి శంకర్ రజనీకాంత్ గురించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు, రజనీకాంత్ ఫ్యాన్స్ కస్తూరి శంకర్ ట్వీట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు