సాధారణంగా కొన్ని సినిమాలు అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సినిమా విడుదలైన తర్వాత ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాగుతూ ఉంటాయి.అలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సినిమాల్లో చిత్రం ఒకటి.
యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు.ఈ సినిమాలో సహజమైన నటనతో ఉదయ్ కిరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఏకంగా 8 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.అయితే ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ తీసుకున్న పారితోషికం కేవలం 11 వేల రూపాయలు కావడం గమనార్హం.
ఉదయ్ కిరణ్ చిత్రం తన తొలి సినిమా కావడంతో ఇంత తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకున్నారు. దర్శకుడు తేజ మొదట ఈ సినిమాకు వేరే వ్యక్తిని హీరోగా తీసుకోగా ఉదయ్ కిరణ్ హీరో ఫ్రెండ్ రోల్ లో నటించాల్సి ఉంది.
కొన్ని రీజన్స్ వల్ల హీరోగా చేయాల్సిన వ్యక్తి ఆ పాత్రకు నో చెప్పడంతో చివరకు ఉదయ్ కిరణ్ సినిమాలో హీరోగా ఫైనల్ అయ్యారు.

42 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతకు భారీ లాభాలను అందించింది.దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఈ సినిమా కోసం తక్కువ మొత్తం పారితోషికం తీసుకోవడం గమనార్హం.దర్శకుడు తేజ నువ్వు నేను సినిమాకు మాధవన్ ను హీరో గా తీసుకోవాలని అనుకోగా మాధవన్ ఆ సమయంలో తెలుగు సినిమాలలో నటించడానికి అంగీకరించకపోవడంతో తేజ ఉదయ్ కిరణ్ తో నువ్వు నేను సినిమా తీశారు.
బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచిన సంగతి తెలిసిందే