ప‌చ్చి ఉల్లిపాయ తింటే ఆ శ‌క్తి పెరుగుతుంద‌ట‌..తెలుసా?

ఎక్క‌డో, ఎప్పుడో చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్.ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మ‌హ‌మ్మారి ఉచ్చులో ప‌డి ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోగా.ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి.

మ‌రోవైపు కోట్ల మంది ఈ వైర‌స్‌తో పోరాటం చేస్తూనే ఉంటాయి.అయితే ఈ మాయ‌దారి క‌రోనా వైర‌స్ నుంచి త‌మ‌ను ర‌క్షించుకోవాలంటే.

ఖ‌చ్చితంగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాలి.అందుకే క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి రోజు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Advertisement

అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌ర‌చ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ముఖ్య పాత్ర‌లు పోషిస్తుంటాయి.అలాంటి వాటిలో ఉల్లిపాయ‌లు కూడా ఉన్నాయి.

అందులోనూ ప‌చ్చి ఉల్లిపాయలు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా పెంచ‌గ‌ల‌వు.అవును, అంద‌రి ఇళ్ల‌ల్లోనూ విరి విరిగా ఉప‌యోగించే ఉల్లిలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్, విటమిన్ సి, విట‌మిన్‌ బి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నిండి ఉంటాయి.

అంతేకాదు, ఉల్లిలో ఐదు రకాలైన ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి.ఇవి రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంతో పాటు కొత్త క‌ణాల‌ను నిర్మించేందుకు కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే ఉల్లిని వేయించి లేదా ఉడికించి తీసుకోవ‌డం కంటే.

ప‌చ్చిగా తీసుకోవ‌డం వ‌ల్లే వేగంగా ఇమ్యూనిటీ ప‌ర‌వ్ పెరుగుతుంది.అందుకే ప‌చ్చి ఉల్లిని డైరెక్ట్‌గా తీసుకోవ‌డం, స‌లాడ్స్ రూపంలో తీసుకోవ‌డం, పెరుగుతో పాటుగా తీసుకోవ‌డం చేస్తే మంచిది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇక ప‌చ్చి ఉల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా ప‌చ్చి ఉల్లిని డైట్‌లో చేర్చుకుంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Advertisement

ద‌గ్గు, జులుబు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.కీళ్ల నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు క్యాన్స‌ర్ క‌ణాలు కూడా వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు