తెలంగాణ రాష్ట్రంలో పల్లె పట్టణ అభివృద్ధి భాగస్వామ్యంలో అందరి సహాయం అవసరమని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె పట్టణ అభివృద్ధి లో భాగస్వామ్యం కాబోతున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ పట్టణాల అభివృద్ధిని యజ్ఞం గా భావించాలని ఇటీవల అధికారులతో భేటీ అయిన సమయములో కెసిఆర్ తెలిపారు.పచ్చదనం పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇచ్చే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వాటి అమలు తీరు ఏ విధంగా ఉంది అన్న దానిపై ప్రతి జిల్లాలో పర్యటించడానికి ఈనెల 20వ తారీకు నుండి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో పనితీరు విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయని .సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో పాలన విషయం అదనపు కలెక్టర్ ల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఇటీవల అధికారులతో జిల్లా కలెక్టర్ లతో భేటీ అయిన తరుణంలో కెసిఆర్ స్పష్టం చేశారు.స్థానిక సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం కోసం అదనపు కలెక్టర్లకు ప్రత్యేకమైన నిధులు ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు.