రేవంత్ సంచలన నిర్ణయం !  బీజేపీ టీఆర్ఎస్ లకు పోటీగా  ఏం చేయబోతున్నారంటే ? 

హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో తో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి తేరుకుంటున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ హవా తగ్గడంతో,  టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ధర్నాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

 Revanth Reddy Sensational Decision On Farmers Movement Details, Revanth Reddy,-TeluguStop.com

  తెలంగాణలో మరింత బలోపేతం అయ్యేందుకు ఈ రెండు పార్టీలు  ప్రయత్నిస్తున్నాయనే వ్యవహారాలతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు.
  తాజాగా తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ వ్యవహారాలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీలు,  సంఘాలు అన్ని జాయింట్ యాక్షన్ కమిటీగా  ఏర్పాడి ఉద్యమిస్తే ఇప్పుడు బిజెపి టిఆర్ఎస్ లు  జేఏసీ గా మారాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.  రైతు సమస్యలపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన రేవంత్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ , బీజేపీ టీఆర్ఎస్ జేఏసీ అంటే జాయింట్ యాక్టింగ్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ దగ్గర ఏసీ లతో ధర్నాలు దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు.రైతుల పక్షాన పోరాటం చేయాలి అంటే రైతుల దగ్గరకు వెళ్లాలని , లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలి అని సూచించారు.
  బిజెపి నేత బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ ని నిలదీయాలని  సూచించారు.

Telugu Bandi Sanjay, Hujurabad, Kisshan Reddy, Modi, Revanth Reddy, Telangana, T

ఈనెల 19 నుంచి 23 వరకు కళ్లా ల్లోకి  వెళ్లి కాంగ్రెస్ ఉద్యమం చేపడుతుందని,  ఈ నెల 23 వరకు కేసీఆర్ కు సమయం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.అప్పటికీ స్పందించకపోతే రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.రాష్ట్రంలో వరి పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని , మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇక టిఆర్ఎస్ , బిజెపిలకు పోటీగా కాంగ్రెస్ కూడా ధర్నా కార్యక్రమం చేపడుతుందని రేవంత్ చెబుతున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube