ఆది పురుష్ లో కీలక పాత్రలో కార్తిక్ ఆర్యన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో ఓం రౌత్ దర్శకత్వంలో టి-సిరీస్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్.రామాయణం ఆధారంగా చేసుకొని కంప్లీట్ త్రీడీ విజువల్ వండర్ గా ఈ మూవీని తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఇక ఈ మూవీలో ప్రభాస్ రాముడుగా నటిస్తున్నాడు.ఇక సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ముంబైలో షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉంటే జులై ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో మూవీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

\ అలాగే రావణుడు సోదరుడు విభీషణుడు పాత్రలో కిచ్చా సుదీప్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు బిటౌన్ లో ఆది పురుష్ మూవీ గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది.

యంగ్ సెన్సేషన్ కార్తిక్ ఆర్యన్ ఆది పురుష్ లో నటించాబోతున్నాడని ప్రచారంలోకి వచ్చింది.ఓ కీలక పాత్ర కోసం అతన్ని ఎంపిక చేయడం జరిగిందనే మాట గట్టిగా వినిపిస్తుంది.

అయితే కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టి బ్యాక్ టూ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నాడు.అలాగే హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ఆది పురుష్ లో భాగం అయ్యే అవకాశం ఉందా అనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది.అయితే వీటిలో వాస్తఃవం ఏంటి అనేది దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు