నటి జూహీ చావ్లాకు భారీ జరిమానా విధించిన ఢిల్లీ హైకోర్టు.. ఎందుకంటే..?!

ఇండియాలో నెట్‌వ‌ర్క్ రోజురోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతోంది.ఏ స్థాయిలో అయితే టెక్రాల‌జీ డెవ‌ల‌ప్ అవుతుందో అదే స్థాయిలో వివాదాలు కూడా త‌లెత్తుతున్నాయ‌నే చెప్పాలి.

ఇందుకు నిద‌ర్శ‌న‌మే దేశంలో 5జీ నెట్‌వ‌ర్క్‌.ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో ఉన్న 4జీ నెట్‌వ‌ర్క్ ప‌రిధిని దాటి5జీ నెట్‌వ‌ర్క్ టెక్నాల‌జీని తీసుకురావాల‌ని చేస్తున్న ట్ర‌య‌ల్స్ చుట్టూ ఇప్పుడు వివాదం న‌డుస్తోంది.

ఇక మ‌న దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి పెద్ద దుమార‌మే రేపింది.అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధ‌ర్మాసనం ఆస‌క్తిక‌ర తీర్పును ఇచ్చింది.

ఆమె ఫిర్యాదును తోసిపుచ్చుతూ దేశంలో టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాలని, ఇందుకు అడ్డ‌ప‌డ‌కూడ‌ద‌ని వెల్ల‌డించింది.ఇలాంటి విష‌యాల‌తో కోర్టు సమయాన్ని వృథా చేయ‌డం మంచిది కాదంటూ నటికి రూ.20 లక్షల జరిమానా విధించింది ఢిల్లీ ధ‌ర్మాస‌నం.

Advertisement

ఇదే కోర్టులో వాద‌న‌లు జ‌రుగుతుండ‌గా జూహీ చావ్లా ఆమె అభిమాని ఒక‌రు పాటలు పాడడం.అందుకు సంబంధించిన వీడియోను నటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఢిల్లీ ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టును అవ‌హేళన చేసేలా మీ చ‌ర్య‌లు ఉన్నాయంటూ మండిప‌డింది.

ఈ విషయం గురించి కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాస్తే బాగుండేద‌ని కోర్టు తెలిపింది.జూహీ వేసిన పిటిషన్ లో సరైన సమాచారం లేదని.

కేవలం పబ్లిసిటి కోసమే పిటిషన్ ధాఖలు చేశారని కోర్టు త‌న తీర్పులో సీరియస్ అయ్యింది.ఇదిలా ఉంటే.

దేశంలో 5జీ టెక్నాలజీ వలన తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని.ఈ టెక్నాలజీ వలన ఎలాంటి ప్రమాదం లేదని.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ప్రభుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ వచ్చేవరకు 5జీ నెట్ వర్క్ ట్రయల్ ఆపాలని కోరుతూ.జూహీ చావ్లా సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును గ‌తంలో ఆశ్ర‌యించారు.

Advertisement

కానీ దీనిపై కోర్టు మాత్రం ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా వివ‌ర‌ణ ఇచ్చింది.

తాజా వార్తలు