బలహీనమైన క్షణాల్లో బలవంతున్ని భయపెడితే లొంగుతాడు అని అంటారు.జూనియర్ డాక్టర్ల ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే ఎప్పటి నుండో జుడాల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.గతంలో వీరి విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి.
కానీ అవి సంతృప్తికరంగా ముగియలేదు.అందుకే సమయం చూసి సమ్మే అంటూ ఊహించని షాక్ ఇచ్చారు జూనియర్ డాక్టర్లు.
అసలే కరోనా ఆనకొండలా మారిపోయింది.దీనికి తోడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు.ఇలాంటి సమయంలో జూనియర్ డాక్టర్ల సమ్మే ప్రభుత్వానికి తలనొప్పిగా పరిగణించడంతో ఎక్కువగా ఆలస్యం చేయకుండా వీరి డిమాండ్లలో కీలకమైన వాటికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.అందులో వీరికిచ్చే స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ఇందుకు సంబంధించి ఉత్తర్వులను అధికారికంగా జారీ చేసింది.దీంతో సీనియర్ రెసిడెంట్లకు రూ.70 వేల నుంచి 80,500 వరకు జీతాలు అందుతాయట.అంతే కాకుండా జూడాల కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న డిమాండ్‌కు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుని, వీరి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందట.మొత్తానికి అనుకున్నది సాధించుకున్నారు జుడాలు.