జూనియ‌ర్ డాక్ట‌ర్లుకు కేటీఆర్ హెచ్చ‌రిక‌.. ?

కరోనా సమయంలో నిజమైన వారియర్స్ ఎవరంటే వైద్య సిబ్బంది అని ఒప్పుకోక తప్పదు.ఎందుకంటే కోవిడ్ సోకిన పేషెంట్స్‌తో ప్రత్యక్షంగా పోరాడుతున్న వారు వీరే.

మిగతా శాఖల సిబ్బంది పరోక్షంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుండగా, వైద్యులు, నర్సింగ్ డిపార్ట్ మెంట్ వారు రోగుల దగ్గరకు వెళ్లకుండా ట్రీట్‌మెంట్ చేయకుండా మాత్రం ఉండలేరు.అంటే కరోనా వైరస్ తో ప్రత్యక్షమైన వార్ వీరు చేస్తున్నారు.

ఇంతటి విపత్కర పరిస్దితుల్లో వీరిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే కాదు, ప్రజల పై కూడా ఉంది.ఎందుకంటే ఒక్క సారిగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమ సేవల నుండి తప్పుకుంటే లోకం వల్లకాడు అవుతుంది.

ఇలాంటి సమయంలో వారి కష్టాలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం పై ఉంది.ఇకపోతే జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి సమ్మె చేయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఐతే ఈ విషయంలో స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ జూనియ‌ర్ డాక్ట‌ర్లు చేస్తున్న స‌మ్మెను వెంట‌నే విర‌మించాల‌ని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.ఈ క్రమంలో కొందరు వారి సమస్యలకు దారి చూపితే వారెందుకు సమ్మే చేస్తారు సార్ అని అనుకుంటున్నారట.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు