ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది.
పరిస్థితులు ఇలా ఉండగా ఎన్నికలలో గెలుస్తుంది అని అనుకున్నా కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే.పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సహా అందరూ ఓడిపోయారు.
మక్కల్ నీది మయ్యం పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకో లేకపోయింది.
దీంతో సొంత పార్టీలో ఉన్న చాలామంది నేతలు .పార్టీ విడిచి పెట్టి వెళ్ళిపోతున్నారు.మరోపక్క కమల్ పని అయిపోయిందని రకరకాల వార్తలు తమిళ రాజకీయాల్లో వస్తున్నాయి.
పార్టీలో ఉన్న మిగిలిన నేతలు సొంత గొంతును వ్యవహరిస్తున్నారు కమల్ హాసన్ పై విమర్శలు చేసే పరిస్థితి.ఇలాంటి తరుణంలో తాజా రాజకీయాలపై కమలహాసన్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటానని వీడియో రూపంలో తెలియజేశారు.రాజకీయాల్లో ఉన్నంత వరకు మక్కల్ నీది మయ్యం పార్టీ పోరాడుతుందని ఉంటుందని స్పష్టం చేశారు.
.