ఒక్కో సినిమాకు మణిశర్మ పారితోషికం ఏంటో తెలుసా?

సంగీతం అంటే ఇష్టపడని వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.

ఎందుకంటే సంగీతం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో కీలకపాత్ర పోషించి ఉండే ఉంటుంది.

మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాట విని ఎంజాయ్ చేస్తాం, బాధలో ఉన్నప్పుడు పాటలో ఉన్న లిరిక్స్ వింటూ మనం బాధను మర్చిపోతాం.అలా సంగీతం అనేది మనిషి రోజూవారీ జీవితంలో ఒక నిత్యకృత్యమయింది.

ప్రతి ఒక్కరు పాటలలో మెలోడీని ఎక్కువగా ఇష్టపడుతారు.ఇక మెలోడీ అంటే మనందరికి ఠక్కున గుర్తుకొచ్చేది ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.

మెలోడీలో అత్యద్భుత సంగీతాన్ని సమకూర్చుతూ మెలోడీ బ్రహ్మ మణిశర్మగా పేరు సంపాదించుకున్నాడు.ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చి మరల ఫామ్ లోకి వచ్చాడు.

Advertisement

ఇప్పుడు మణిశర్మ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే మణిశర్మ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని మనలో చాలా మందికి ఉంటుంది కదా.మణిశర్మ ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుండి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా మణిశర్మ పాటకు  ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంటుంది.

అంతలా మణిశర్మ పాటలను శ్రోతలు అంతలా అక్కున చేర్చుకున్నారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు