భారత్ బయోటెక్‌లో కరోనా కలకలం.. !

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎందరో కరోనా వారియర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే.

కంటికి కనిపించని ఈ వైరస్‌తో చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా వర్ణిస్తున్నారు కూడా.

రక్తం చిందకుండా, విస్పోటనం జరగకుండా లెక్కలేనన్ని ప్రాణాలు అత్యంత దయనీయస్దితిలో పోతున్నాయి.ఇక ఈ వైరస్ ను ఎదుర్కొనెందుకు వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి.

అయినా కూడా కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు.ఇదిలా ఉండగా కరోనా టీకాలలో ఒక్కటైనా కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది.

ఈ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడినట్లుగా సమాచారం.కాగా ఈ విషయాన్ని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

కాగా ప్రజలను రక్షించే టీకాలు చేస్తున్న సంస్ద ముందుగా వారికి ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేదో అంటూ విషయం తెలిసిన నెటిజన్స్ ప్రశ్నలు వేసుకుంటున్నారట.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు