తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలయా జట్టుపై ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయాలలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.అయితే టీమ్ ఇండియా సాధించిన విజయం పై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ఆయన టీమ్ పైన్ సంచలన కామెంట్స్ చేశాడు తాజాగా.
ఇందులో భాగంగా టీమిండియాతో మ్యాచులు ఆడటం చాలా చాలెంజ్ గా ఉంటుందని.అలాగే వారు మన దృష్టిని మార్చి మానసికంగా దెబ్బతీయడంలో చాలా సిద్ధహస్తులని చెప్పుకొచ్చాడు.
తాజాగా జరిగిన సిరిస్ లో టీమిండియా ఆటగాళ్లు ఎక్కడ పైచేయి సాధించారు అర్థం చేసుకునే వారు విజయం సాధించారు అని చెప్పుకొచ్చాడు.ఇందుకు ఉదాహరణగా గబ్బర్ టెస్ట్.
ముందు వాళ్లు గబ్బా టెస్ట్ ఆడేందుకు ఎలాంటి ఇష్టం లేకపోవడం అన్నట్లూ కనిపించారని.అసలుకి బ్రిస్బేన్ కి రావడం ఇష్టం లేనట్లుగా టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు.
అయితే టీమిండియా ఆటగాళ్లు అలా ఎందుకు చేశారు అంటే.టీమిండియా ఆటగాళ్లు భయపడుతున్నారని మనం భ్రమలోకి వెళ్ళిపోదామని అప్పుడు మనల్ని వారు మానసికంగా దెబ్బ తీసి ఆపై వారు పైచేయి సాధిస్తారు అంటూ కామెంట్ చేశాడు.
ఆ సిరీస్ లో మొదటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించిన టీమిండియా ఆ తర్వాత కేవలం రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న తర్వాత
కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవుపై స్వదేశానికి వెళ్లిన తర్వాత అజింక్యా రహనే సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చాడు.32 ఏళ్లుగా గబ్బ స్టేడియంలో జరిగిన టెస్టులో ఒక్కసారి కూడా ఓడిపోని ఆస్ట్రేలియాకు అబ్బా.అనిపించేలా రిషబ్ పంత్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ తో టీమిండియాకు వీరోచిత విజయాన్ని అందించాడు.అయితే ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టు పై అనేక విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ ను స్టీవ్ స్మిత్ తిరిగి మళ్లీ అందించాలని పెద్దఎత్తున అభిప్రాయం వ్యక్తం చేశారు ఆస్ట్రేలియా జట్టు అభిమానులు.