పవన్ కళ్యాణ్ కు 100 ముద్దులిస్తా.. నటి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఎక్కువగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.అలా ప్రతిభతో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన సురేఖావాణి తాజాగా ఒక షోలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

1994 సంవత్సరంలో తొలిసారి సిటీ కేబుల్ లో నటించానని అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని ఆమె తెలిపారు.తనది లవ్ మ్యారేజ్ అని విజయవాడ సిటీ కేబుల్ లో పరిచయమైన వ్యక్తినే తాను పెళ్లి చేసుకున్నానని సురేఖ వాణి చెప్పుకొచ్చారు.

తాను చిరంజీవి గారితో కలిసి స్టాలిన్ సినిమాను చేశానని చిరంజీవి గారిని చూడగానే తనకు కన్నీళ్లు వచ్చేశాయని సురేఖావాణి పేర్కొన్నారు.ఆ సమయంలో మెగాస్టార్ మేకప్ పోతుంది ఏడవద్దంటూ తనను ఓదార్చారని ఆమె చెప్పుకొచ్చారు.

కూతురు సుప్రీత యాక్టింగ్ బాగానే చేస్తుందని సురేఖావాణి అన్నారు.

Advertisement

సుప్రీత ఒక్కోసారి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని మరోసారి డీజే అవుతానని చెబుతుందని సినిమాల్లో కూడా సుప్రీతకు ఆఫర్లు వస్తుండటంతో ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని సురేఖావాణి అన్నారు.యాంకర్ 100 ముద్దులు ఇవ్వాలంటే ఏ హీరో గుర్తుకొస్తారని అడగగా సురేఖావాణి పవన్ కళ్యాణ్ కు ముద్దులిస్తానని చెప్పారు.మాస్టర్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తీసేయడం గురించి మాట్లాడుతూ ఎడిటింగ్ లో తన పాత్ర పోయిందని సురేఖావాణి అన్నారు.

అయితే మాస్టర్ ఓటీటీలో రిలీజైన సమయంలో మాత్రం తన సన్నివేశాలు ఉండటంతో దానికి సంబంధించి కొన్ని మీమ్స్ వచ్చాయని ఆమె తెలిపారు.తాను సెటిలైపోయానని సినిమాలు మానేశానని ప్రచారం జరుగుతోందని ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సురేఖావాణి చెప్పుకొచ్చారు.

గత రెండేళ్లుగా పెద్దగా అవకాశాలు లేని ఈ ఏడాదైనా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు